NTV Telugu Site icon

Srinu Vaitla: భార్య లేకున్నా వారు ఉంటే చాలు అంటున్న స్టార్ డైరెక్టర్..?

Srinu Vaitla

Srinu Vaitla

Srinu Vaitla: టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవసరం లేదు. దూకుడు, వెంకీ, ఢీ లాంటి చిత్రాలు ఆయనను ఎప్పుడూ గుర్తుచేస్తూనే ఉంటాయి. ప్రస్తుతం శ్రీను వైట్ల కెరీర్ ఒడిదుడుకుల మధ్య కొట్టుకొంటున్న విషయం విదితమే. ఒక పక్క సినిమా అవకాశాలు లేక ఇంకోపక్క భార్యతో వివాదం.. శ్రీనును అతలాకుతలం చేస్తున్నాయి. శ్రీను వైట్ల భార్య రూప.. తన అబ్రత నుంచి విడాకులు కావాలని కోరుతూ కోర్టు మెట్లెక్కిన విషయం విదితమే. ఈ విషయమై రూప కానీ, శ్రీను వైట్ల కానీ ఇప్పటివరకు స్పందించలేదు. ఇక గత మూడు రోజుల క్రితం పోస్ట్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో శ్రీను తన ముగ్గురు కూతుళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇక ఈ ఫోటోను షేర్ చేసిన శ్రీను “జీవితం చాలా అందమైంది. మనకిష్టమైన వారితో ఉంటే అది మరింత అందంగా ఉంటుంది. ఈ ముగ్గురు లేకుండా నా జీవితం లేదు” అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చాడు. ఈ ఫోటో ద్వారా ఈ డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు. భార్య లేకపోయినా పిల్లలను తాను చేసుకోగలను అని చెప్తున్నాడా..? లేక విడాకుల తరువాత పిల్లలు వెళ్ళిపోతే ఉండలేను అని చెప్తున్నాడా..? అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా వ్యక్తిగత సమస్యలతో శ్రీను వైట్ల బాగా కృంగిపోయినట్లు తెలుస్తోంది. ఇక ప్రొఫెషనల్ గా చుస్తే మంచు విష్ణు తో ఢీ 2 ను ఎప్పుడో ఎనౌన్స్ చేశారు. అది ఇప్పటివరకు పట్టాలెక్కింది లేదు. ఎప్పుడు ఎక్కుతుందో కూడా తెలియదు. మరి ఈ సమస్యలన్నింటిని శ్రీను వైట్ల ఎలా పరిష్కరించనున్నాడో చూడాలి.