Site icon NTV Telugu

Srinidhi Shetty : అందుకే నాని తో మూవీ ఓకే చూశా..

Srinidhi

Srinidhi

‘కేజీఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి. మొదటి సినిమాతోనే స్టార్ హోదా సంపాదించుకుంది. కానీ యష్ లాంటి స్టార్ హీరోతో కలిసి తెరపై మెరిసిన, ఆ తర్వాత మాత్రం ఆమె కెరీర్ ఊహించిన దిశగా సాగలేదు. తదుపరి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అందులో విక్రమ్ సరసన చేసిన ‘కోబ్రా’ ఒకటి. అయినా సరే నిరుత్సాహ పడకుండా.. ఇప్పుడు టాలీవుడ్‌లో తన రెండో ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేయాలని ఉత్సాహంగా ఉంది శ్రీనిధి. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న ‘హిట్ 3’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. మే 1న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చిత్రాన్ని అంగీకరించడానికి కారణాన్ని వివరించింది.

Also Read : Rohit Shetty : టాలీవుడ్ నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది..

శ్రీనిధి మాట్లాడుతూ.. ‘ హిట్ 3 స్క్రిప్ట్ నా దగ్గరకు రాగానే క్షణం కూడా ఆలోచించకుండా అంగీకరించాను. నాని అంటే ఓ బ్రాండ్. ఆయన సినిమాలో ఆఫర్ వచ్చినప్పుడు ప్రశ్నలు అడగకుండా అంగీకరించాలి. నేను ఇందులో ఆయన భార్య గా కనిపించనున్నాను. నేను ప్రోమో లో ఎక్కువగా కనిపించలేదు. కానీ, నా పాత్ర చాలా శక్తివంతమైనది. ఈ మూవీ నా కెరీర్ కి మంచి గ్రాఫ్ ని అందిస్తుందని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది. నిజంగా ఈ మూవీ పై పరిశ్రమలో అంచనాలు భారీగానే ఉన్నాయి. కాబట్టి, ఈ సినిమా విజయం ఆమె కెరీర్‌కు తిరుగు లేని బూస్ట్ ఇవ్వొచ్చు. మరి ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.

Exit mobile version