Site icon NTV Telugu

Srinidhi Shetty: అత్యాశ పడింది.. చేతులు కాల్చుకుంది?

Srinidhi Shetty Remuneratio

Srinidhi Shetty Remuneratio

సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ & డిమాండ్ ఉన్నప్పుడు.. ఫ్యాన్సీ రెమ్యునరేషన్ అడగడంలో తప్పు లేదు. కానీ, అది కన్విన్సింగ్ గా ఉండగలగాలి. తాము అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు రాగలిగేలా ‘ఫిగర్’ ఉండాలి. అలా కాకుండా, క్రేజ్ వచ్చింది కదా అని ఇష్టమొచ్చినట్టు డిమాండ్ చేస్తే మాత్రం.. మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు శ్రీనిధి శెట్టి పరిస్థితి అలాగే ఉందని సమాచారం. ఈమె భారీ పారితోషికం డిమాండ్ చేస్తోందని, అందుకే ఆఫర్లు పెద్దగా రావడం లేదని టాక్ వినిపిస్తోంది. ఆమె డిమాండ్ చూసి, వస్తున్న ఆఫర్లు సైతం వెనక్కు వెళ్తున్నాయట!

నిజానికి.. శ్రీనిధి శెట్టి ఇప్పటివరకూ చేసింది కేవలం మూడంటే మూడు సినిమాలే! అందులో ఒకటి (కోబ్రా) ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఇక మిగిలిన రెండు సినిమాలేంటో అందరికీ తెలుసు. అవే.. కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందే కేజీఎఫ్ చాప్టర్1 చిత్రంతో! ఆ సినిమా మంచి విజయం సాధించినప్పుడే, శ్రీనిధి పారితోషికం పెంచేసింది. అప్పుడే ఆఫర్స్ వెనక్కు వెళ్లాయి. ఇక కేజీఎఫ్2 దేశవ్యాప్తంగా సంచలనాలు నమోదు చేయడం, ఇండియాలోనే మూడో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో.. ఈ అమ్మడు దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. వాస్తవానికి, ఈ రెండు సినిమాల్లోనూ శ్రీనిధి పాత్ర నిడివి తక్కువే. రెండో భాగంలో మాత్రమే కొంచెం ఎక్కువగా ఉంది. కాస్త ప్రభావవంతంగానే రోల్ ఉంటుంది కానీ, మరీ హైలైట్ అయితే కాదు.

ఈ లెక్కన శ్రీనిధి కాస్తో కూస్తో పెంచితే, నిర్మాతలు ఇచ్చేందుకు ముందుకొస్తారు. కానీ, ఈ అమ్మడు మాత్రం తాను అడిగినంత ఇస్తేనే సినిమాలు చేస్తానని తెగేసి చెప్తోందట. దీంతో, నిర్మాతలు వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్లిపోతున్నారని వినికిడి. ఓవైపు అభిమానులందరూ ఈమెను స్టార్ హీరోల సరసన చూడాలని కోరుకుంటుంటే, ఈ అమ్మడు మాత్రం పారితోషికం విషయంలో మొండిగా వ్యవహరిస్తూ ఆఫర్లు పోగొట్టుకుంటోంది. ఇది ఇలాగే కొనసాగిస్తే, శ్రీనిధి కెరీర్ ముందుకు సాగడం కష్టమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version