NTV Telugu Site icon

Srikanth- Raasi: ఎంత చూడముచ్చటగా ఉన్నారో.. వైరల్ గా మారిన వీడియో

Raasi

Raasi

Srikanth- Raasi: ఒకప్పుడు కలిసి పనిచేసిన లేక చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న స్నేహితులు చాలా కాలం తర్వాత కలిస్తే ఎలా ఉంటారు అనేది అందరికీ తెలిసిందే. వారిలో ఉండే ఆనందం ఆ ముఖంలో ఉండే సంతోషం బయటికి కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడో విడిపోయిన వారు ఒక్కసారిగా మళ్లీ తిరిగి కలిసనప్పుడు ఆ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ.. ఆ బంధాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక తాజాగా ఒక ఈవెంట్లో అలాంటి ఇద్దరు స్నేహితులు కలవడం విశేషం అయితే.. వారిద్దరి అపూర్వ కలయిక ఎంతోమంది అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. ఆ స్నేహితులు ఎవరో కాదు హీరో శ్రీకాంత్, నటి రాశి. ఈ జంట ఒకప్పుడు ఎన్నో మంచి సినిమాలలో నటించి మెప్పించారు. ప్రేయసి రావే, అమ్మ ఒకటో తారీకు, దీవించండి, పండుగ, గిల్లికజ్జాలు, సరదా సరదాగా, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది లాంటి సినిమాల్లో ఈ జంట సందడి చేశారు. ఇక ఈ సినిమాలన్నీ హిట్ కావడం మరో విశేషం. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది రాశి. ఇక హీరోగా కాకుండా విలన్ గా సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో శ్రీకాంత్ బిజీగా మారిపోయాడు. చాలా కాలం తర్వాత రాశి.. జానకి కలగనలేదు అనే సీరియల్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ తర్వాత ఆమెకు సినిమాల నుంచి కూడా మంచి అవకాశాలు రావడం మొదలుపెట్టాయి.

Jyothi Rai: హీరోయిన్ గా గుప్పెడంత మనసు జగతి ఆంటీ.. పోస్టర్ చూశారా .. ఎంత హాట్ గా ఉందో

ఇక ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రుద్రంకోట సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీకాంత్, రాశి గెస్ట్ లుగా కనిపించారు. ఇక ఆ సందర్భంగా వీరిద్దరూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. శ్రీకాంత్ తో కలిసి పనిచేయడం ఎంతో అద్భుతం అని రాశి చెప్పుకు రాగా.. శ్రీకాంత్ సైతం ఆమెతో కలిసి నటించడం చాలా కంఫర్టబుల్ అని తెలిపాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు కానీ ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉండడం ఆ వీడియోలో కనిపిస్తుంది. పాత స్నేహితులు ఇద్దరు చాలా కాలం తర్వాత కలిస్తే ఎలా సంతోషపడతారో .. వీరిద్దరు కూడా అలాగే సంతోషంగా కనిపించడంతో నెటిజన్స్ ఈ వీడియోని వైరల్ గా మార్చేశారు. ఈ వీడియో పై అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. ఈ జంట ఎంత ముచ్చటగా ఉన్నారు పాత స్నేహితులు కలిస్తే ఇలాగే ఆనందంగా ఉంటారు అని కొందరు అంటుండగా.. ఈ జంట మరోసారి తెరమీద కనిపిస్తే బాగుంటుందని ఇంకొందరు అంటున్నారు. మరి మేకర్స్ ఏమైనా ఈ జంటను మరోసారి కలుపుతారేమో చూడాలి.

Show comments