Srikanth Iyengar Responds on Boom Boom Beer Video: నటుడిగా అనేక తెలుగు సినిమాలలో నటించి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అయ్యంగార్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. తాను ఏపీకి వచ్చానని, విజయవాడలో ఉన్నానని వీడియోలో చెప్పిన ఆయన అక్కడి బీర్ తీసుకుని తాగుతున్నాను అంటూ బూం బూం బీర్ ను చూపిస్తూ ఒక వీడియో చేసిన ఆయన కొత్త చర్చకు దారి తీశారు. తాను ఈ బూం బూం బీరు తాగుతున్నట్టు ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదని, ఏం అవుతుందో ఏమో అంటూ భయపడుతూ ఆ బీరు గటగటా తాగేస్తూ వీడియో పోస్ట్ చేశారు. ఇక ఇదే విషయం మీద ఆయనని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఆ విషయం మీద ఆయన ఘాటుగా స్పందించారు.
Nabha Natesh: శారీ పిక్స్ తో మనుసు దోచుకుంటున్న నభా నటేష్
ఒక ఏపీ ప్రభుత్వ మద్దతుదారు తాను దారుణంగా బూతులతో తిట్టాడని, దమ్ముంటే విజయవాడ వచ్చి మందు తాగమని సవాల్ విసిరాడు అని అన్నారు. ఇక మణికొండ నుంచి కూకట్ పల్లి వెళ్లడానికి గంటన్నర పడుతుంది అంటే బీఆర్ఎస్ ను విమర్శించినట్టు కాదని అన్నారు. ఏ పని చేయడం రాని వాడే ఇలా కామెంట్లు పెట్టుకుంటూ బతుకుతాడని, పని ఉన్నవాడు పని చేసుకుంటాడని అన్నారు. ఇక ఆ కామెంట్లు పెడుతున్న వారిని పదేళ్ల తర్వాత రమ్మని ఏమి పీకుతాడో చూడాలి అని అంటూ ఆయన సవాల్ విసిరారు. ఒకరకంగా తాను ఏపీ ప్రభుత్వం మీద కానీ, అధికార పార్టీ గురించి కానీ ఎలాంటి కామెంట్లు చేయలేదని ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.