Site icon NTV Telugu

రివ్యూ రైటర్లపై శ్రీకాంత్ అయ్యంగార్ ఫైర్.. పీకుడు పని చేస్తేనే అంటూ!

Srikanth On Reviews

Srikanth On Reviews

Srikanth Iyengar Strong Commnts On Review Writers At Bedurulanka 2012 Success Meet: కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురు లంక 2012’ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ సంపాదించింది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ సినిమాలో వర్మ శిష్యుడు క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. థియేటర్లలో శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోన్న క్రమంలో సినిమా యూనిట్ శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ ‘మా అన్నయ్య అజయ్ ఘోష్, అబ్బో.. ఫెర్ఫార్మెన్స్‌కి వచ్చేసరికి ఆయన తిమింగల స్వరూపం అని ఆయన దగ్గర నేర్చుకుని ఆయనతో కలిసి నటించే ఒక మంచి అవకాశం నాకు దక్కిందని అన్నారు.

Salaar: సలార్ సినిమాలో శృతి హాసన్ రోల్ లీక్.. ఏ పాత్రో తెలుసా?

అన్నిటికన్నా ముఖ్యంగా ఎంత కష్టపడ్డాం అనే విషయం జనాలకు కనబడదని, తెరపై కనిపించేదే జనాలకు తెలుసని అన్నారు. రివ్యూస్, గివ్యూస్ రాస్తారు, అసలు మనమేదైనా పీకుడు పనిచేసి, సాధించి ఇంకొకడు గురించి రాస్తే ఫర్వాలేదు కానీ కెమెరా వర్క్ రాదని ఎవడో రాస్తే మనం ఇక్కడ ఎందుకుంటాం? అని ప్రశ్నించారు. కాంతార అనే సినిమాకు ఒక్క రివ్యూ లేదు కానీ జనాలు దాన్ని హిట్టు చేయలేదా? అని అన్నారు. ప్రేక్షకులకు చెప్పనవసరం లేదన్న శ్రీకాంత్ వాళ్లకు ఒక విషయం నచ్చితే వాళ్లే థియేటర్లకు వచ్చి ఆదరిస్తారని, వాళ్లకు నచ్చకపోతే పట్టించుకోరని శ్రీకాంత్ అయ్యంగార్ ఫైర్ అయ్యారు. ఇక రామ్ గోపాల్ వర్మ దగ్గర క్లాక్స్ పని చేస్తున్నప్పుడు కలిశానని, నాకు మంచి వేషం ఇచ్చినందుకు థాంక్స్ అని అన్నారు. ‘చావు కబురు చల్లగా’లో కార్తికేయతో నటించానని, సూపర్ స్టార్ అయ్యే లక్షణాలు అతనిలో ఉన్నాయని అన్నారు.

Exit mobile version