సినిమా ఇండస్ట్రీకి వారసులు పరిచయం కావడం అనేది సాధారణ విషయమే. అయితే టాలీవుడ్ లో అది వారసులకే పరిమితం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల కూతుర్లు ఎక్కువగా సినిమా ఇండస్ట్రీపై ఆసక్తి చూపించరు. చాలామంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే హీరోయిన్లుగా సినిమా ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళు కూడా గ్లామర్ పాత్రలకు దూరంగా కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ చూసే పద్ధతి గల పాత్రల్లోనే కన్పించారు. ఎందుకంటే స్టార్ హీరోల కూతుర్లు వెండితెరపై గ్లామర్ ఒలకబోయడం వారి అభిమానులకు నచ్చదు. లక్ష్మీ మంచు, నిహారిక కొణిదె, శివాని, శివాత్మిక ఈ కోవకు చెందినవారే. రాజశేఖర్ కూతుర్లు నెమ్మదిగా గ్లామర్ గేట్లు ఎత్తేస్తున్నారు.
Read Also : సెప్టెంబర్ సినిమాల రిలీజ్ లలో భారీ మార్పులు
ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి మరో స్టార్ వారసురాలు ఎంట్రీ ఇవ్వబోతోంది అన్న టాక్ ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తోంది. శ్రీకాంత్ కుమారుడు, 22 ఏళ్ల రోషన్ ఇప్పటికే అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం రోషన్ “పెళ్లి సందడి” సీక్వెల్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆయన 17 ఏళ్ల కుమార్తె మేధా త్వరలో అరంగేట్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మేధా భరత నాట్యంలో శిక్షణ పొందింది. ఆమె ప్రస్తుతం జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి కూడా. చదువు పూర్తి చేసిన తర్వాత ఆమె వెండితెరపై అడుగుపెట్టడానికి సరైన దర్శకుడు, నిర్మాణ సంస్థ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. మేధా ఇప్పటికే “రుద్రమదేవి”లో అనుష్క చిన్నప్పటి పాత్రను పోషించింది. శ్రీకాంత్ భార్య, మేధా తల్లి ఊహ కూడా ఒకప్పుడు హీరోయిన్ అన్న విషయం తెలిసిందే.
