NTV Telugu Site icon

Srikanth: శ్రీకాంత్ కూతురు ఏంటి మావా.. హీరోయిన్స్ కన్నా అందంగా ఉంది..

Uha

Uha

Srikanth: నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యనే కోటబొమ్మాళీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. ఇక శ్రీకాంత్.. వీలుదొరికినప్పుడల్లా కుటుంబంతో ఆలయాలు సందర్శిస్తుంటారు. తాజాగా నేడు తిరుమల శ్రీవారిని శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీకాంత్ తన భార్య ఊహ, పిల్లలు రోషన్, మేధాతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా, టిటిడి అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. ” అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రస్తుతం నేను దేవర, గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటిస్తున్నాను. మంచి సినిమాలు.. ఇక ఈ ఏడాది అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను” అని తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు. ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో శ్రీకాంత్ కూతురు మేధ హాట్ టాపిక్ గామారింది. ఈ చిన్నది చీరకట్టులో ఎంతో అందంగా కనిపించింది. తల్లి పోలికలతో ఉన్న మేధ.. హీరోయిన్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం హాట్ హీరోయిన్స్ గా చెలామణీ అవుతున్న హీరోయిన్స్ కన్నా మేధ అందంగా ఉందని, హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వడానికి సరిగ్గా సరిపోతుందని చెప్పుకొస్తున్నారు. ఇక ఇప్పటికే శ్రీకాంత్ పెద్ద కొడుకు రోషన్ హీరోగా మారాడు. ప్రస్తుతం రోషన్ మోహన్ లాల్ చిత్రంలో నటిస్తున్నాడు.. అది కాకుండా వైజయంతీ బ్యానర్ లో ఛాంపియన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక తల్లిదండ్రుల్లా, అన్నలా మేధ.. ఇండస్ట్రీలో అడుగుపెడుతుందో.. లేకవేరే ప్రొఫెషన్ ను ఎంచుకుంటుందో చూడాలి.