NTV Telugu Site icon

Srikanth Addala: పెన్ను వదిలి కత్తి పట్టిన శ్రీకాంత్ అడ్డాల

Srikanth Addala

Srikanth Addala

‘కొత్త బంగారు లోకం’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న శ్రీకాంత్ అడ్డాల… నారప్ప సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు అనగానే అందరూ ఫ్యామిలీ సినిమాల దర్శకుడు యాక్షన్ మూవీని ఎలా హ్యాండిల్ చేస్తారు అనుకున్నారు కానీ శ్రీకాంత్ అడ్డాలా ఆడియన్స్ ని, తాను యాక్షన్ సినిమా చెయ్యగలని నమ్మించడంలో సక్సస్ అయ్యాడు. ఇక ఇప్పుడు విరాట్ కర్ణ అనే కొత్త హీరోని ఇండస్ట్రీకి పరిచయం చేస్తు శ్రీకాంత్ అడ్డాల ‘పెద కాపు’ అనే సినిమా చేస్తున్నాడు. ‘ఓ సామాన్యుడి సంతకం’ అనే ట్యాగ్ లైన్‌ తో అనౌన్స్ అయిన ఈ మూవీ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో, రెండు వర్గాల మధ్య నలుగుతున్న జనం మధ్య నుంచి పుట్టి, వారి కోసం పోరాడిన ఒకడి కథతో ఈ సినిమా తెరకెక్కినట్లు అనిపిస్తోంది. టీజర్ లో చోటా కె నాయుడు పనితనం, శ్రీకాంత్ అడ్డాల మేకింగ్ సూపర్బ్ గా అనిపించాయి. శ్రీకాంత్ అడ్డాలలో ఇంత వయొలెన్స్ ఉందా అనిపించకమానదు.

ఈ రేంజ్ సినిమాలు కెరీర్ స్టార్టింగ్ లోనే చేసి ఉంటే శ్రీకాంత్ అడ్డాల ఈ పాటికి స్టార్ డైరెక్టర్ అయిపోయే వాడు. మేకింగ్ లో శ్రీకాంత్ అడ్డాల ఎంత చేంజోవర్ చూపించాడో, మ్యూజిక్ లో మిక్కీ జె మేయర్ కూడా అంతే కొత్తగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. పెదకాపు 1 టీజర్ బీజీఎమ్ వింటే, ఈ స్కోర్ ఇచ్చింది మిక్కీ జె మేయర్ యేనా అని ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. హీరోగా పరిచయం అవుతున్న విరాట్ కర్ణ కూడా స్క్రీన్ పైన ప్రామిసింగ్ గా కనిపించాడు. అతన్ని చూస్తూనే ముకుందా సినిమాలో వరుణ్ తేజ్ ని చూస్తున్నట్లు అనిపించింది. పెదకాపు 1 సినిమా కూడా ముకుంద సినిమాకి ఇంకో వెర్షన్ లా ఉండే అవకాశం కూడా ఉంది. మొత్తానికి శ్రీకాంత్ అడ్డాల పెన్ పక్కన పెట్టి కత్తి పట్టి సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి రాబోతున్నాడు. అన్నట్లు పెదకాపు 1 టీజర్ ఎండ్ లో శ్రీకాంత్ అడ్డాల కనిపించాడు, ఏదైనా క్యారెక్టర్ చేస్తున్నట్లు ఉన్నాడు. మరి ఈ మూవీతో శ్రీకాంత్ అడ్డాల హిట్ కొడతాడో లేదో చూడాలి.

Show comments