NTV Telugu Site icon

Srikanth Addala: ‘నారప్ప’ డైరెక్టర్.. ‘అఖండ’ విశ్వరూపం.. PK తోనా..?

Pk

Pk

Srikanth Addala: మంచితనానికి మారుపేరు అంటే శ్రీకాంత్ అడ్డాల. కుటుంబం, బంధువులు, విలువలు, బంధాలు.. ఆయన తీసే సినిమాల్లో ఇవే ఉంటాయి. ఒక మంచి మాట అయినా మన గురించి చెప్పుకోరా అన్న విధంగా ఆయన సినిమాలు ఉంటాయి. ఇంకా అలాంటి రేలంగి మామయ్య.. నారప్పతో మాస్ డైరెక్టర్ గా మారిపోయాడు. అసురన్ సినిమాను వెంకీ స్టైల్లో నారప్పగా మార్చేశాడు. అసలు నారప్ప చూసినవారెవ్వరు ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల తీసాడు అంటే నమ్మరేమో. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని శ్రీకాంత్ లోని మరో కోణాన్ని వెలికి చూసింది. ఇక ఈ నారప్ప తరువాత మళ్లీ సైలెంట్ అయిపోయిన ఈ డైరెక్టర్ ఇన్నేళ్ల తరువాత ఓకే బిగ్ అప్డేట్ తో సోషల్ మీడియాను షేక్ చేశాడు. ఇక ఈయనకు తోడు అఖండ నిర్మాతలు వచ్చేశారు. ఇద్దరు కలిసి కొత్త ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రకటన ఇవ్వకుండానే పోస్టర్ తో వచ్చి ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చారు.

JD Chakravarthy : వార్నీ.. జేడి చక్రవర్తి ఆ టైపా.. ఒక్కరిని కూడా వదల్లేదా?

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో అఖండ సినిమాతో టపా ప్రొడక్షన్ హౌస్ లో ఒకటిగా మారిన ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ మేరకు సినిమా టైటిల్, హీరో లుక్ పోస్టర్ ను జూన్ 2 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక చివరన PK1 అంటూ వర్కింగ్ టైటిల్ చెప్పుకొచ్చారు. అంటే కొత్త హీరోను ఎవరినైనా పరిచయం చేస్తున్నారా..? లేక ఏ నటవారసుడు టాలీవుడ్ ఎంట్రీ బాధ్యతలు ఏమైనా శ్రీకాంత్ తీసుకున్నాడా..? అనేది తెలియాల్సి ఉంది. ఇక పోస్టర్ లో రక్తసిక్తమైన ఒక చేతిని చూపించారు. నారప్ప తరువాత ఊర మాస్ డైరెక్టర్ గా మారిన శ్రీకాంత్.. ఈసారి ఈ సినిమాతో తనలోని విశ్వరూపాన్ని చూపించబోతున్నాడని తెలుస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించిన పూర్తీ వివరాలు తెలియాలంటే.. మరో మూడు రోజులు ఆగాల్సిందే.

Show comments