సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్, పాటలకు చక్కటి స్పందన లభించింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగిందట. థియెట్రికల్ రైట్స్ 12 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం. సీనియర్ నిర్మాత, పంపిణీదారుడు, బ్రిడ్జ్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ ‘శ్రీదేవి సోడా సెంటర్’ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘జాతి రత్నాలు’ సినిమాను లక్ష్మణ్ పంపిణీ చేయటం విశేషం. మరి లక్కీ హ్యాండ్ ద్వారా విడుదల అవుతున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ అదే లక్ ను కంటిన్యూ చేస్తుందేమో చూద్దాం.
12 కోట్లకు ‘శ్రీదేవి సోడా సెంటర్’ థియేట్రికల్ రైట్స్
