మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న “ఆచార్య” ఏప్రిల్ 29న విడుదల కానుంది. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే కీలకపాత్రలో కనిపించనుంది. శనివారం రాత్రి జరిగిన “ఆచార్య” ప్రీ రిలీజ్ వేడుకలో “శ్రీదేవి శోభన్ బాబు” థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్, గౌరీ జి కిషన్ జంటగా నటించారు. నాగబాబు, రోహిణి తదితరులు కూడా ఈ సినిమాలో సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. కమ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది.
Read Also : Acharya Event : కాజల్ ఊసే లేదు… విలన్ని కూడా పక్కన పెట్టేశారే !?
ట్రైలర్ విషయానికొస్తే… ప్రామిసింగ్ గా ఉంది. రెండు విభిన్న ధృవాల వంటి హీరోహీరోయిన్లు సంతోష్ శోభన్, గౌరీ కిషన్ ప్రేమలో పడడం ఆసక్తికరంగా మారింది. ఆ తరువాత ఆమెను ఇంటికి తీసుకెళ్లగా, శోభన్ కు అక్కడే సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య ఏమిటి? అసలేం జరిగింది? వీరిద్దరి మధ్య దూరం ఎందుకు పెరిగింది ? మళ్లీ ఎలా ఒక్కటయ్యారు? అనేది వెండితెరపై చూడాల్సిన కథ.