Sridevi: అందాల అతిలోక సుందరి శ్రీదేవి గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె అందం, నటన, వాక్చాతుర్యం ఏ హీరోయిన్ కు రావు.. రాలేవు. ప్రస్తుతం ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా నిత్యం ఆమె సినిమాలతో అభిమానులకు దగ్గరగానే ఉంటారు. ఇక శ్రేదేవి రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రంగా ఇంగ్లీష్ వింగ్లిష్ రికార్డులను తిరగరాసిన విషయం విదితమే. సినిమా హిట్ అయ్యిందా..? ప్లాపు అయ్యిందా..? అని పక్కన పెడితే ఆమె ఎన్నో ఏళ్ళ తరువాత వెండితెరపై సందడి చేయడంతో అభిమానులందరూ ఆమె అందానికి మంత్రం ముగ్దులయ్యారు. ఒక సగటు మహిళగా, తల్లిగా, పరభాష రాని గృహిణిగా శ్రీదేవి నటన అద్భుతమని చెప్పాలి.
ఇక ఆ సినిమా ఈ నెల 10 వ తేదికి పదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మేకర్స్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.. ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాలో శ్రీదేవి కట్టుకున్న చీరలను వేలం వేయనున్నారు. ఆ వచ్చిన డబ్బును బాలికల విద్య కోసం వినియోగించే స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వనున్నారు. ఈ విషయాన్నీ ఇంగ్లిష్ వింగ్లిష్ డైరెక్టర్ గౌరీ షిండే తెలిపారు. అయితే ఎక్కడ వేలం వేయనున్నారు..? అనేది మాత్రం త్వరలోనే తెలుపుతామని అన్నారు. మీరు కూడా శ్రీదేవి కట్టిన చీరలు కొనాలనుకుంటున్నారా..? అయితే వారు ఎలా విక్రయిస్తారో తెలిపే వరకు వేచి చూడాల్సిందే,
