Site icon NTV Telugu

Sridevi : ‘కోర్టు’ హీరోయిన్ సీక్రెట్‌గా పెళ్లి..! వీడియో వైరల్

Sreedevi

Sreedevi

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా నేరుగా సినీ అవకాశాలు పొందిన వారు చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్‌లో తాజాగా చేరిన పేరు ‘కోర్ట్’ మూవీ హీరోయిన్ శ్రీదేవి. ఈ ఏడాది సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కోర్ట్ చిత్రంలో అద్భుతమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఆమె, ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. సినిమా ఆఫర్లతో పాటు షాపింగ్ మాల్, రెస్టారెంట్ ఓపెనిం‌గ్స్ వంటి ఈవెంట్లతో కూడా రెండు చేతులా సంపాదిస్తోంది. ఇంత వరకు భాగానే ఉన్నప్పటి‌కి తాజాగా ఆమె వ్యక్తిగత జీవితం చుట్టూ ఓ రూమర్ హల్‌చల్ చేస్తోంది.

ఇటీవల రక్షా బంధన్ సందర్భంగా శ్రీదేవి తన కుటుంబ సభ్యులకు రాఖీలు కడుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియోలో ఆమె మెడలో పసుపు తాడు (తాళిబొట్టు) కనిపించడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సాధారణంగా పెళ్లైన మహిళ‌లే పసుపు తాడు ధరిస్తారని తెలుసు. దీంతో, ‘శ్రీదేవి‌కి పెళ్లి ఎప్పుడు జరిగింది?’ ‘ఎవరి‌కీ తెలియకుండా చేసుకుందా?’ ‘వరుడు ఎవరు?’.. అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కొంతమంది ఇది సినిమా షూటింగ్‌లో భాగమని ఊహిస్తుండగా, మరికొందరు వీడియోలో ఆమె ఇంట్లో ఉన్నట్లు కనిపిస్తోంద‌ని, షూటింగ్ కాకపోతే పసుపు తాడు ఎందుకు ధరిస్తుం‌ది? అని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ మిస్టరీపై శ్రీదేవి ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. ఆమె నిజంగానే సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని ఉంటే, దానిని ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వచ్చిందో తెలుసుకోవాలన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతుంది. ఏదేమైనా, ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

&nbsp

Exit mobile version