Comrade Kalyan Release Date: వైవిధ్యభరితమైన కథలను ఎంచుకునే హీరో శ్రీ విష్ణు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియడ్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ తెలుగు మూవీ ‘కామ్రేడ్ కళ్యాణ్’ (Comrade Kalyan). జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో, ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. 1992 నాటి ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందుతున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ ను 2026 అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకోగా, ఇక త్వరలోనే ట్రైలర్‌తో పాటు పూర్తి స్థాయి ప్రమోషన్ క్యాంపెయిన్‌ను ప్రారంభించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ కథ 1992 కాలంలో ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని విశాఖపట్నం జిల్లా మాడుగుల గ్రామం నేపథ్యంలో సాగుతుంది. ఆ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ నక్సల్ లీడర్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ను పట్టుకోవడానికి పోలీసులు, గ్రేహౌండ్స్ దళాలు చేసే ఒక పెద్ద ఆపరేషన్, దాని చుట్టూ నడిచే ఇంటెన్స్ యాక్షన్, హిలేరియస్ వినోదాల సమాహారమే ఈ కథాంశం.
ఈ సినిమాలో శ్రీ విష్ణు డ్యూయల్ రోల్స్ లో కనిపిస్తూ అలరించనున్నారు. అంతేకాకుండా ఈ పాత్రల కోసం ఆయన తన కెరీర్‌లోనే మొదటిసారి ఒక విభిన్నమైన యాసను మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇందులో మలయాళ బ్యూటీ మహిమ నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా, పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు రాధికా శరత్‌కుమార్, దసరా ఫేమ్ షైన్ టామ్ చాకో, బ్రహ్మాజీ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ‘బేబీ’ ఫేమ్ విజయ్ బుల్గానిన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ‘ఇంత ఇష్టమా’ వంటి సాంగ్స్ చార్ట్‌బస్టర్స్ గా నిలిచి మ్యూజికల్ గా సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. అన్ని కార్యక్రమాలను ముగించుకుని, ఈ క్రేజీ యాక్షన్ కామెడీ చిత్రాన్ని దసరా పండుగ కానుకగా 2026 అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

