Site icon NTV Telugu

Srisimha: ఆయుధ పూజ సందర్భంగా ‘ఉస్తాద్’ ఎంట్రీ

Ustaad First Look

Ustaad First Look

Sri Simha Ustaad First Look Released: ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా నటించిన తాజా చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’ ఇటీవలే విడుదలైంది. కానీ అతని గత చిత్రం ‘తెల్లవారితే గురువారం’ తరహాలోనే ఎలాంటి ఇంపాక్ట్ బాక్సాఫీస్ మీద చూపించలేకపోయింది. అయినా శ్రీసింహకు పలు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘ఉస్తాద్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. దసరా సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.

దసరాకు అంతా ఆయుధ పూజలు చేస్తుంటారు. ఇలాంటి ఆయుధ పూజ నాడు ‘మా ఉస్తాద్‌ను మీకు పరిచయం చేయడం ఆనందంగా ఉందం’టూ మేకర్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో శ్రీసింహా ఎంతో హ్యాండ్సమ్ గా ఉన్నాడు. అతని బైక్ పేరు ఉస్తాద్. బైక్‌తో దోస్తీ చేసే ఈ ‘ఉస్తాద్’ కథ ఆసక్తికరంగా ఉంటుందని మేకర్లు తెలిపారు. వారాహి చలన చిత్ర బ్యానర్ అధినేత సాయి కొర్రపాటి గారి ఆధ్వర్యంలో కృషి ఎంటర్టైన్మెంట్స్ మీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మే నెలలోనే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. దాదాపు తొమ్మిది రోజుల పాటు జడ్చర్ల గ్రామంలో ఈ మూవీ షూటింగ్‌ను నిర్వహించారు. సెప్టెంబర్ 15న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ పూర్తయింది. ఇక ఇప్పుడు మూడో షెడ్యూల్‌ అతి త్వరలో ప్రారంభం కానుంది. రానున్న రోజుల్లో ఈ మూవీ నుంచి మరిన్ని అప్ డేట్స్ వస్తాయని మేకర్స్ చెబుతున్నారు.

Exit mobile version