NTV Telugu Site icon

Simha Koduri: ఇంతకీ ఆ ఉంగరం కథ ఏంటి మాస్టారు?

Bhaag Saale

Bhaag Saale

‘సింహా కోడూరి’ హీరోగా నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భాగ్ సాలే’. ముద్దపప్పు ఆవకాయ్, సూర్యకాంతం, నాన్న కూచీలతో లాంటి క్రియేటివ్ వర్క్స్ తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రణీత్ బ్రహ్మాండపల్లి ‘భాగ్ సాలే’ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. జులై 7న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసారు. ఈ ప్రమోషన్స్ కోసం ఒక మాస్టర్ ప్లాన్ వేసి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సిద్ధూ జొన్నలగడ్డతో వాయిస్ ఓవర్ ఇప్పించి ‘భాగ్ సాలే’ ప్రపంచాన్ని ఆడియన్స్ ని పరిచయం చేసారు. ‘షాలి శుఖ గాజా’ ఒక డైమండ్ రింగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ల లైఫ్ టర్న్ అవ్వడంతో పాటు ట్రబుల్స్ ని కూడా పేస్ చేస్తూ ఉంటారు.

బ్రిటిషర్లు, ఫ్రెంచ్ వాళ్లు, నైజాం రాజులని దాటుకుంటూ వచ్చిన ఆ డైమండ్ రింగ్ హీరో లైఫ్ ని ఎలాంటి మలుపులు తిప్పింది అనేది ‘భాగ్ సాలే’ కథలా కనిపిస్తోంది. టీజర్ తో మేకర్స్ మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయడంలో సక్సస్ అయ్యారు. లేటెస్ట్ గా ఆ పాజిటివ్ బజ్ ని మరింత పెంచడానికి మేకర్స్ భాగ్ సాలె ట్రైలర్ ని రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. జూన్ 26న మధ్యాహ్నం 12:30కి భాగ్ సాలె ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి ఆ రింగ్ ఏంటి? దాని కథ ఏంటి? అది సింహ కోడూరిని ఎన్ని ఇబ్బందులు పెట్టింది, అసలు ఈ క్రైమ్ కామెడీ సినిమాతో అయినా సింహా కోడూరి హిట్ అందుకుంటాడా అనే ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే జులై 7 వరకు వెయిట్ చెయ్యాల్సిందే.