NTV Telugu Site icon

SriReddy: రానా తమ్ముడితో నాకు శోభనం అక్కడే జరిగింది.. దాన్ని కూల్చకండి

Sri Reddy

Sri Reddy

SriReddy: టాలీవుడ్ లో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ అనగానే పురుషుల్లో రాంగోపాల్ వర్మ వస్తే మహిళల్లో శ్రీరెడ్డి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకానొక సమయంలో ఆమె సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా దగ్గుబాటి వారసుడు అభిరామ్ ను నడిరోడ్డుకీడ్చిన ఘనత శ్రీరెడ్డిది. ఇక ఆ తరువాత నాకు సినిమా అవకాశాలు ఇవ్వడం లేదని ఫిల్మ్ ఛాంబర్ ముందు నగ్న ప్రదర్శన చేసి టాలీవుడ్ ను షేక్ చేసింది. ఇక ఈ మధ్య కొద్దిగా జోరు తగ్గించిన శ్రీరెడ్డి మరోసారి తాజాగా మరోసారి రెచ్చిపోయింది. మానిపోయిన పాత గాయాన్ని రేపి చిచ్చుపెట్టింది. ఇప్పుడిప్పుడే దగ్గుబాటి కుటుంబం ఆ అవమానం నుంచి బయటపడుతోంది. అభిరామ్ సైతం అహింస సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో మరోసారి దగ్గుబాటి కుటుంబాన్ని కెలికింది శ్రీరెడ్డి.

Read Also: Russia – Ukraine War: 120క్షిపణులతో ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడి

అసలు విషయమేంటంటే.. నానక్ రామాగూడా దగ్గర ఉన్న రామానాయుడు స్టూడియోస్ ఉన్న విషయం తెల్సిందే. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న ఈ స్టూడియోస్ లో చాలా సినిమాలు షూటింగ్ ను జరుపుకున్నాయి. అయితే గత కొన్నిరోజులుగా ఈ స్టూడియోను సురేష్ బాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం ఇచ్చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ వార్తలపై శ్రీరెడ్డి స్పందించింది. ” ఆ స్టూడియోను ఎందుకు కనుమరుగు చేస్తున్నార్రా..? అందులో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ స్టూడియోలోనే నాకు, అభిరామ్ కు ఫస్ట్ నైట్ జరిగింది.. ఇప్పుడు అది కూల్చొస్తే మా జ్ఞాపకాలు ఏంకాను.. దాని కూల్చకండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Read Also: SriReddy: రానా తమ్ముడితో నాకు శోభనం అక్కడే జరిగింది.. దాన్ని కూల్చకండి