Site icon NTV Telugu

BSS10: శ్రీనివాస్ బెల్లంకొండ పదో చిత్రం ఎవరితో అంటే….

Bellamkonda

Bellamkonda

Srinivas Bellamkonda: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ బెల్లంకొండ ఈ యేడాది బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతను నటించిన ‘ఛత్రపతి’ రీమేక్ మే 12న విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే… శ్రీనివాస్ నటిస్తున్న 10వ చిత్రానికి సంబంధించిన ప్రకటన శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు వెలువడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని తెరకెక్కించిన సాగర్ కె చంద్ర ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో మూవీ చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించబోతోంది.

దర్శకుడు సాగర్ చంద్ర తొలి చిత్రం ‘అయ్యారే’తోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అలానే ఆయన రెండో సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా సాగర్ చంద్ర బెల్లంకొండ శ్రీనివాస్ కోసం విన్నింగ్ స్క్రిప్ట్ ఒకటి రెడీ చేశారని, ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నామని రామ్ ఆచంట, గోపీ ఆచంట తెలిపారు. ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఆ వివరాలను త్వరలోనే తెలియచేయనున్నారు.

Exit mobile version