Site icon NTV Telugu

మనసులో మాట: పెళ్లి ఎప్పుడో చెప్పేసిన శ్రీముఖి

బుల్లితెర బ్యూటీ, యాంకర్ శ్రీముఖి అప్పుడప్పుడు సినిమాలోనూ తళుక్కుమంటున్న సంగతి తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రల్లోను రాణిస్తోంది. తాజాగా ఆమె నటించిన ‘క్రేజీ అంకుల్స్’ చిత్రం ఈ నెల 19న విడుదల అవుతోంది. సినీ గాయకుడు మనో, నటులు రాజా రవీంద్ర, భరణిలతో కలిసి శ్రీముఖి కలిసి నటించగా.. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించారు. కాగా, విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ వేగాన్ని పెంచింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో శ్రీముఖి మాట్లాడుతూ.. తన పెళ్లిపై ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ‘మంచి వ్యక్తి దొరకడానికి సమయం పడుతుందని.. పెళ్లి చేసుకోవడానికి తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపింది. ప్రస్తుతం తన వయసు 28 ఏళ్లని, తనకు 31 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు శ్రీముఖి చెప్పుకొచ్చింది.

ఈ సినిమాకి నేను సెట్ అవుతా అని అనుకోలేదు: శ్రీముఖి

https://youtu.be/x5EXwJEX9d8
Exit mobile version