Sreemukhi getting Married Soon Says Mukku Avinash: నటిగా కెరీర్ ప్రారంభించి తర్వాత యాంకర్ గా మారింది శ్రీముఖి. యాంకర్ గా మారిన తర్వాత పటాస్ లాంటి ప్రోగ్రాంతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత అదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి కూడా ఎంటర్ అయ్యి అక్కడ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఆ తర్వాత సినిమాలో హీరోయిన్గా కూడా చేస్తూనే మరోపక్క చిన్న చిన్న పాత్రలలో కూడా మెరుస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా ఈ భామ చేతిలో దాదాపు 4, 5 షోస్ ఉన్నాయి. ఆ ఛానల్ ఈ ఛానల్ అని తేడా లేకుండా ఈ టీవీ, స్టార్ మా, జీ తెలుగు, జెమిని అన్ని షోస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ పండగ షోలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది. ఈ భామకు మూడు పదుల వయసు దాటుతూ ఉండడంతో పెళ్లెప్పుడు అనే ప్రశ్న ఎప్పటికప్పుడు ఎదురవుతూనే వస్తుంది.
Kareena Kapoor: ఆ పదం వాడినందుకు కరీనా కపూర్ కు షాక్?
అయితే ఈమె పెళ్ళి గురించి ఈమెతో క్లోజ్ గా ఉండే జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీముఖి పెళ్లి గురించి ఆయన కామెంట్స్ చేశారు. ఇక శ్రీముఖి తల్లిదండ్రులు ప్రస్తుతానికి శ్రీముఖి కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, మొన్నటి వరకు ఆమె చేసుకోనంటుంది నువ్వైనా పెళ్లి చేసుకోమని చెప్పమనేవారని ఇప్పుడు మాత్రం అదేమీ లేకుండా సంబంధాలు చూస్తున్నారని చెప్పుకొచ్చాడు. అన్ని బాగుంటే ఈ ఏడాది పెళ్లి చేసుకునే అవకాశం ఉందని కూడా కామెంట్ చేశాడు. సంబంధాలు చూస్తుంటే శ్రీ ముఖి కూడా పాజిటివ్ గానే ఉందని నచ్చిన కుర్రాడు దొరికితే ఈ ఏడాది పెళ్లి అయిపోవచ్చని కామెంట్ చేశాడు.