NTV Telugu Site icon

Sreeleela: కొన్ని రోజులు షూటింగ్ కి దూరం… కారణమదేనా?

Sreeleela

Sreeleela

యంగ్ హీరోయిన్స్ లో శ్రీలీలకి ఉన్న డిమాండ్ ఇంకొకరికి లేదు. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ ప్రతి ఒక్కరికీ శ్రీలీలనే కావాలనుకుంటున్నారు. గత నాలుగు నెలల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు శ్రీలీల నుంచి వచ్చాయి. ధమాకా సినిమాతో స్టార్ గా ఎదిగిన ఈ హీరోయిన్ కి ప్రస్తుతం కష్టాలు ఎదురవుతున్నాయి. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలు శ్రీలీల ఇమేజ్ ని భారీ డెంట్ పెట్టాయి. ఈ మూడు సినిమాల్లో శ్రీలీల పెర్ఫార్మెన్స్ జీరో అనే చెప్పాలి. ఆమెని డైరెక్టర్స్ డాన్స్ కోసం అండ్ ఆమెకున్న ఇమేజ్ ని వాడుకోవడం కోసం మాత్రమే కాస్టింగ్ చేసారు కానీ శ్రీలీల ఉపయోగ పడే లేదా ఆమె యాక్టింగ్ స్కిల్స్ ని చూపించే ఒక్క సీన్ ని కూడా ఇవ్వలేదు. అందుకే మూడు నెలల్లో మూడో ఫ్లాప్స్ ని ఫేస్ చేసింది శ్రీలీల.

బాలయ్య చేసిన భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో శ్రీలీల నుంచి చెప్పుకునే సినిమా ఏమైనా వచ్చిందా అంటే అది భగవంత్ కేసరి మాత్రమే. శ్రీలీల నుంచి నెక్స్ట్ గుంటూరు కారం సినిమా రానుంది. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమా రిజల్ట్ పైనే శ్రీలీల కెరీర్ ఆధారపడి ఉంది, ఇది తేడా కొడితే శ్రీలీల కెరీర్ కష్టాల్లో పడినట్లే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న గుంటూరు కారం సినిమా సెట్స్ కి ఒక వారం రోజులు దూరంగా ఉండనుంది శ్రీలీల… ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్న కారణంగా ఒక వారం రోజుల పాటు శ్రీలీల షూటింగ్స్ కి అందుబాటులో ఉండే అవకాశం కనిపించట్లేదు. ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన తర్వాత శ్రీలీల మళ్లీ సెట్స్ లో జాయిన్ అవ్వనుంది.

Show comments