Site icon NTV Telugu

Sreeleela: ఈ అందాన్ని ఏ హీరో వదులుతాడు.. చెప్పండి

Sreeleela

Sreeleela

Sreeleela: టాలీవుడ్ మొత్తాన్ని ఇప్పుడు ఏలుతున్న ఏకైక హీరోయిన్ శ్రీలీల. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరనుంచి.. పంజా వైష్ణవ్ తేజ్ వరకు అమ్మడు అందరిని కవర్ చేస్తోంది. బాలకృష్ణ, మహేష్ బాబు, నితిన్, రామ్.. ఇలా చెప్పుకొంటూ పోతూ పెద్ద లిస్ట్ యే ఉంది. టాప్ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. అస్సలు అమ్మడి డేట్స్ అడ్జెస్ట్ అవ్వక.. ఆమె ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు స్టార్ హీరోలు డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. పెళ్లి సందD సినిమాతో ముద్దుగుమ్మ అడుగుపెట్టినప్పుడే.. ఇండస్ట్రీని ఏలుతుందని ఏ మహానుభావుడు చెప్పాడో కానీ.. దాన్నీ నిజం చేసేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అంటే అమ్మడి అందం అలాంటిది మరీ. చిన్న వయస్సు.. ఇప్పుడిప్పుడే లేలేత ప్రాయంలోకి అడుగుపెడుతుంది.

Vinayakan: అసలు సీఎం ఎవరు.. అతను మంచి వ్యక్తి అని ఎవరు చెప్పారు.. ?

అందమైన నగుమోము.. అంతకు మించిన అభినయంతో కుర్రకారును కట్టిపడేస్తోంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో అమ్మడు హాట్ హాట్ ఫోటోషూట్స్ తో రెచ్చిపోతూ ఉంటుంది. అంటే ఇప్పటివరకు మరీ అంత ఎబెట్టుగా డ్రెస్సింగ్ చేసింది లేదు. కానీ, ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా అదరగొడుతోంది. తాజాగా ఈ చిన్నది లైట్ గ్రీన్ కలర్ లెహంగాలో అదరగొట్టింది. పద్దతిగా జుట్టుకు క్లిప్ పెట్టి, ఎంతో అందంగా కనిపించింది. ఇక ఆమె లుక్ కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇంత అందంగా ఉంటే ఏ హీరో వదులుతాడు .. చెప్పండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ భామ నటిస్తున్న చిత్రాలు అన్ని హిట్ ను అందుకోని రికార్డులు సృష్టిస్తాయా..? లేదా అనేది చూడాలి.

Exit mobile version