Site icon NTV Telugu

Sreeleela: రష్మిక బిజీ షెడ్యూల్ శ్రీలీలకి కలిసొచ్చింది

Sreeleela

Sreeleela

Sreeleela joins Nithin- Venky Kudumula Movie shoot: ‘భీష్మ’ హీరో హీరోయిన్లు నితిన్, రష్మిక, దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా మొదలు పెట్టిన విషయం కొన్నాళ్ల క్రితం అధికారికంగా ప్రకటించారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ గా క్రియేటివిటీతో ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే నితిన్ & వెంకీ కుడుముల ప్రాజెక్ట్ లో రష్మిక నటించలేనని చెప్పేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జోడీగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘పుష్ప 2’తో పాటు రెండు మూడు బాలీవుడ్ ప్రాజెక్టులు ఉండటంతో ఈ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని రష్మిక సినిమా నుంచి వాకవుట్ చేశారు.

Boys Hostel: రేయ్ ఎవర్రా మీరంతా.. రష్మీ అందాన్ని పక్కన పెట్టి రక్తం అలా తాగేస్తున్నారు?

దీంతో వెంకీ కుడుముల కొత్త హీరోయిన్ వేటలో పడగా వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ జోడీగా నటిస్తున్న శ్రీ లీలను సంప్రదించడంతో చేతి నిండా సినిమాలు ఉన్నప్పటికీ మరోసారి నితిన్ సరసన నటించడానికి ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. నిజానికి ‘ధమాకా’కు ముందు శ్రీ లీల ఖాతాలో పెద్దగా హిట్స్ లేక పోయినా ధమాకా క్రేజ్‌ను ఆమె బాగా క్యాష్ చేసుకున్నారు. ‘ధమాకా’కు ఆవిడ అందుకున్న పారితోషికం కోటి రూపాయల లోపే అయినా ‘ధమాకా’ తర్వాత మరిన్ని ఛాన్సులు రావడంతో ఇప్పుడు రెమ్యూనరేషన్ డబుల్ చేశారని అంటున్నారు. అది నితిన్ హీరోగా వెంకీ కుడుముల తీస్తున్న సినిమాకి బడ్జెట్ విషయంలో టెన్షన్ లేకపోవడంతో ఆమె క్రేజ్ చూసి నిర్మాతలు కూడా ఓకే అన్నారని టాక్. ఇక తాజాగా ఈ సినిమా షూట్ లో కూడా శ్రీ లీల పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు ఎంతమేరకు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version