తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు మాత్రమే కాదు, వారి వ్యక్తిగత జీవితంలో ప్రేరణాత్మక సంఘటనలు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ZEE5లో ప్రసారమవుతున్న జగపతి బాబు టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ లో యంగ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీ లీల ఆమె తల్లి స్వర్ణలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ అద్భుతమైన సంఘటన బయటపడింది.
Also Read : Mana Shankara Varaprasad Garu : చిరు కోసం అనిల్ రావిపూడి డబుల్ డ్యూటీ!
అయితే ఈ షో స్క్రీన్‌పై ఎన్టీఆర్ కూచిపూడి డాన్స్ చేస్తున్న అరుదైన పాత ఫోటో చూపించారు. దాన్ని చూసి శ్రీ లీల తల్లి స్వర్ణలత ఎమోషనల్ అయ్యారు. ఆమె మాట్లాడుతూ..“నా కూతురు శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలని ప్రేరేపించిన క్షణాన్ని ఈ ఫోటో నాకు గుర్తు చేస్తుంది. ఎన్టీఆర్ గారు చేసిన అద్భుత ప్రదర్శనలను చూసి, శ్రీలీల కూడా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను” అని తెలిపారు. ఎన్టీఆర్ చిన్నతనంలోనే 100 కి పైగా కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారని కూడా స్వర్ణలత తెలిపారు. ఎన్టీఆర్‌ను ఎప్పుడైనా కలిశారా? జగపతి బాబు అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్వర్ణలత.. “1997లో లాస్ ఏంజెల్స్‌లో జరిగిన తానా సమావేశంలో ఎన్టీఆర్‌ను ప్రత్యక్షంగా కలిసే అదృష్టం నాకు లభించింది” అని చెప్పారు. ప్రజంట్ తారక్ గురించి మనకు తెలియని విషయాలు పంచుకొవడంతో ఈ న్యూస్ వైరల్ అవుతున్నాయి.
