Sri Vishnu: టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. ఇటీవలే భళా తందనానా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత శ్రీ విష్ణు నటిస్తున్న చిత్రం అల్లూరి. ఈ చిత్రంలో శ్రీ విష్ణు పోలీస్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు సమాచారం. అందుకు కారణం శ్రీ విష్ణు డెంగ్యూ బారిన పడడమే.
అవును.. గత కొన్ని రోజులుగా శ్రీ విష్ణు ఫీవర్ తో బాధపడుతున్నారు. టెస్టులు చేసి చూడగా డెంగ్యూ అని వైద్యులు ధ్రువీకరించినట్లు సమాచారం. కొన్నిరోజుల నుంచి ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న శ్రీ విష్ణుకు తాజాగా ప్లేట్ లెట్స్ పడిపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం శ్రీ విష్ణుకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలియడంతో హీరో అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకొంటున్నారు. శ్రీ విష్ణు ఆరోగ్యం గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.
