Site icon NTV Telugu

Sree Vishnu: శ్రీ విష్ణు పుట్టినరోజు.. మైండ్ బ్లాకయ్యే గిఫ్ట్ ఇచ్చిన అల్లు అరవింద్

Sree Vishnu

Sree Vishnu

Sree Vishnu Geetha Arts SV 18 Grand Reveal: ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్న హీరో శ్రీవిష్ణు, ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ నుండి అద్భుతమైన బర్త్ డే ప్రజెంటేషన్ అందుకున్నారు. ‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వం వహించే శ్రీవిష్ణు నెక్స్ట్ చిత్రం కోసం ప్రొడక్షన్ హౌస్ శ్రీ విష్ణుతో కొలాబరేషన్ అనౌన్స్ చేసింది . గీతా ఆర్ట్స్‌తో కలిసి, కళ్యా ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. #SV18 గ్రాండ్ రివీల్ వీడియో ద్వారా చేశారు.

Deepika Padukone: ప్రెగ్నెంట్ సరే.. కల్కి సంగతి ఏంటి పాప.. ?

గీతా ఆర్ట్స్ నుంచి శ్రీవిష్ణుకి గిఫ్ట్ అందుతుంది. గిఫ్ట్ బాక్స్ లోపల ఒక పజిల్ ఉందని తెలుసుకున్న శ్రీ విష్ణు ఆ పజిల్‌ని పరిష్కరించినప్పుడు, అది గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తన కొత్త సినిమా గురించి అని తెలుసుకుంటాడు, అలా ఒక వీడియో చేసి రిలీజ్ చేశారు. ఇక చాలా కాలంగా ఒక మంచి,పెద్ద బ్యానర్‌లో పనిచేయాలని ఎదురుచూస్తున్న శ్రీవిష్ణుకి ఇది ఖచ్చితంగా బిగ్ బర్త్ డే ప్రెజెంటేషన్. #SV18 ఒక మంచి ప్రేమకథతో పాటు ఫన్ రోలర్‌కోస్టర్ రైడ్‌గా ఉండబోతుంది. ప్రముఖ టెక్నీషియన్లు ఈ క్రేజీయస్ట్ కాంబినేషన్ లో సినిమా కోసం పని చేయనున్నారు. మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారని తెలుస్తోంది.

Exit mobile version