Family Pack First Look: ‘సామజవరగమన’ సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హీరో శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఉండగా.. తాజాగా ఈ సినిమాకు ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే ఫన్నీ టైటిల్‌ను ఖరారు చేశారు. వినాయక చవితి సందర్భంగా ఈ రోజు మేకర్స్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌ను కూడా చాలా వినూత్నంగా డిజైన్ చేశారు. ఇంట్లోని మెట్ల మధ్యలో శ్రీ విష్ణు విచిత్రమైన భంగిమలో గాల్లో తేలుతూ కిందకు పడిపోతున్నట్లు కనిపిస్తున్నారు. ఆయన ముఖంలో కనిపించే షాక్, భయంతో చాచిన చేతులు చూస్తేనే ఈ సినిమాలో కామెడీ ఎలా ఉండబోతుందో అర్థమవుతోంది. అదే సమయంలో ఆయన చుట్టూ కరెన్సీ నోట్లు గాల్లో ఎగురుతుండటం పోస్టర్‌కు మరో ఇంట్రెస్టింగ్ కోణాన్ని తీసుకొచ్చింది. ఈ గందరగోళాన్ని పై నుంచి చూస్తున్న నరేష్ వీకే, అభిరామి, సాక్షి మాధోల్కర్ కూడా పోస్టర్‌లో కనిపిస్తున్నారు. వీరి ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే శ్రీ విష్ణు పడిపోతున్న సీన్ వెనుక ఏదో పెద్ద కామెడీ రచ్చే ఉన్నట్లు అనిపిస్తోంది.
‘సామజవరగమన’ తర్వాత రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ‘నారి నారి నడుమ మురారి’ సినిమాలోనూ శ్రీ విష్ణు అతిథి పాత్రలో కనిపించారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నారు. ‘సామజవరగమన’ సినిమాకి కథ అందించిన భాను భోగవరపు, నందు సవరిగాన ఈ సినిమాకు కూడా కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. దీంతో ఈ కాంబినేషన్ నుంచి మరోసారి సిట్యువేషనల్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 2న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ‘ఫ్యామిలీ ప్యాక్’ను 2027 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఆఫీషియల్ గా ప్రకటించారు. సంక్రాంతి సీజన్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్‌కు సినిమాలపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. అలాంటి సమయంలో శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో వస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ ఎంతవరకు నవ్విస్తుందో చూడాలి.
Sankranthi is for FAMILY. ❤️
This Sankranthi is for #FamilyPack 🤪💥The SREE VISHNU X RAM ABBARAJU 2 combo is back with a pack full of FUN & MADNESS! 🔥
Happy Vinayaka Chavithi ✨
Come with your FAMILY PACK to theatres this Sankranthi 2027! 😜#FamilyPackedSankranthi 😎… pic.twitter.com/V6b1jNCNw3
— Mythri Movie Makers (@MythriOfficial) September 14, 2026

