Sree Leela Writes a 3 page letter to sekhar master: యంగ్ హీరోయిన్ శ్రీ లీల చేతిలో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. వచ్చిన ఏ ఒక్క సినిమా అవకాశాన్ని కూడా వదులుకోకుండా డేట్స్ సర్దుబాటు చేసుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. అయితే ఆమె నటించిన స్కంద మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న సమయంలో తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆమె పాల్గొంది. అయితే తాను ఒకానొక సమయంలో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కి మూడు పేజీల సారీ నోట్ రాసి పంపినట్టు ఆమె వెల్లడించినట్లు తెలుస్తోంది.
Jason Sanjay: విజయ్ కొడుకు మామూలోడేమీ కాదు.. సైలెంటుగా ఆ పని కానిచ్చేశాడు!
ఒక సినిమా షూటింగ్ సమయంలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న సాంగ్ 30 టేకులు తీసుకోవాల్సి వచ్చిందని, తాను ఎప్పుడూ అలా అన్ని టేక్స్ తీసుకోని నేపథ్యంలో కొరియోగ్రాఫర్ చాలా ఇబ్బంది పడి ఉంటారని భావించి వెంటనే ఆయనకు మూడు పేజీల సారీ నోట్ రాశానని అది ఆయనకు అందిన వెంటనే ఫోన్ చేసి 30 టేక్స్ మీ వల్ల తీసుకోలేదని వెనుక బ్యాక్ గ్రౌండ్ డాన్సర్లు చాలామంది ఉన్నా నేపద్యంలో కొన్నిసార్లు సింక్ కుదరక టేక్స్ తీసుకోవాల్సి వచ్చింది, మీరు ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించవద్దని చెప్పినట్లుగా ఆమె వెల్లడించారు. నిజానికి అన్ని టేక్స్ తన వల్ల తీసుకోవాల్సి వచ్చిందేమో అని శ్రీ లీల చాలా బాధపడింది, చివరికి శేఖర్ మాస్టర్ డాన్సర్స్ కారణంగా టేక్స్ తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించడంతో అప్పుడు ఆమె మనసు కుదుట పడిందట. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో పోతినేని రామ్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా స్కంద మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ తో పాటు వైభవి అనే మరో భామ కూడా హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది