NTV Telugu Site icon

Sree Leela: శ్రీ లీలకి వరుస దెబ్బలు.. ఇక గుంటూరు కారమే టార్గెట్?

Sree Leela

Sree Leela

Sree Leela full focus on Guntur Kaaram: టాలీవుడ్ సెన్సేషన్ యంగ్ బ్యూటీ శ్రీలీల.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భామకు సినిమాలు అయితే వస్తున్నాయి కానీ.. అవి ఆమెకు అంతగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. పెళ్లి సందD సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత ధమాకాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. ఇక స్కంద సినిమా చేసినా ఫలితం రాలేదు. ఇక బాలయ్యతో కలిసి భగవంత్ కేసరి సినిమా చేసి.. సూపర్ హిట్టును తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇటీవల మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి ఆదికేశవ అనే సినిమా చేసింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్దకు వచ్చి పరాజయం దిశలో కొనసాగుతోంది. ఇక తన తదుపరి సినిమా నితిన్ తో చేసే ఎక్స్ ట్రా ఆర్డినరి రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Adhik Ravichandran: స్టార్ హీరో కూతురితో ‘మార్క్ ఆంటోనీ’ డైరెక్టర్ పెళ్లి.. ?

అయితే ఈ సినిమాపై కూడా అంతగా హైప్స్ కనిపించడం లేవు. ట్రైలర్ లో కూడా నితిన్ క్యారెక్టర్ హైప్ తప్ప శ్రీలీల రోల్ అంతగా లేనట్లు కనిపించింది. ఇక ఈ సినిమా హిట్టైనా.. శ్రీలీలకు అంతగా గుర్తింపు వచ్చే ఛాన్స్ కనబడటం లేదు. ఇప్పుడు తనకు ఓ సాలిడ్ హిట్ తో పాటు గుర్తింపు తెచ్చే క్యారెక్టర్ కావాలి. ఈ భామ ఆశలన్నీ మహేశ్ బాబుతో చేస్తున్న గుంటూరు కారం సినిమాపైనే ఉన్నాయి. ఇక త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ పాత్రకు మంచి హైప్ ఉంటుంది. మరి ఈ సినిమాలో శ్రీలీలకు మంచి గుర్తింపు దొరుకుతుందని భావిస్తుంది. ఈ సినిమా హిట్ అయితే.. శ్రీలీల మళ్లీ ఫాంలోకి వస్తుంది. టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ కానుంది. ఇక గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా తెరకెక్కుతుంది. మీనాక్షి మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది. చూడాలి మరి ఈ భామ గుంటూరు కారంపై పెట్టుకున్న ఆశలు ఏం అవ్వనున్నాయో.