Sravanthi Serial to tele cast from December 25th in Gemini: తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది, చి||ల||సౌ|| స్రవంతి సీరియల్. గతంలో చి||ల||సౌ|| స్రవంతి సీరియల్ జెమిని టివిలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ గా నిలిచింది. ఇప్పుడు కూడా అదే పేరుతో జెమినీ టీవీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మెగా డైలీ సీరియల్ స్రవంతిని ఈ డిసెంబర్ 25న సోమవారం రాత్రి 9 గం || లకు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇక ఈ సీరియల్ కథ కూడా ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. పగ ప్రతీకారాలతో రగిలిపోతున్న రిషి అమెరికా నుండి ఇండియా వచ్చి స్రవంతికి తన ప్రేమతో దగ్గరై పెళ్లి చేసుకుని స్రవంతి తన బందీగా అమెరికా తీసుకువెళ్తాడు.. ఇలా బందీ అయిన బంధం ఎలా కొనసాగుతుంది? అనే కథాంశంతో నిర్మితమైన స్రవంతి సీరియల్ లో భరణి, మీనా, నంద కిషోర్, నిఖిల్, మౌనిక, తదితర నటీనటులు నటించారు.
Sravanthi : డిసెంబర్ 25 నుంచి ఈ స్రవంతి మళ్ళీ వచ్చేస్తోంది!

Sravanthi Arrest