‘జెర్సీ’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శ్రద్దా శ్రీనాధ్. ఈ సినిమా తరువాత అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది కానీ, అవకాశాలు మాత్రం రాలేదనే చెప్పాలి. అయితే శ్రద్దా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి పెట్టింది పేరు. కన్నడ లో ఇప్పటికే ‘యూ టర్న్’ చిత్రంలో శ్రద్ద నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక తాజాగా మరోసారి శ్రద్దా శ్రీనాధ్ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది. తమిళ్ లో కలియుగం పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో శ్రద్దా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా విభిన్నంగా ఉంటుందని.. ప్రతి ఒక్కరు కూడా ఏంజాయ్ చేసే విధంగా ఉంటుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇండియాలోనే అలౌకికమైన కథతో హారర్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట మేకర్స్.
ఇక ఈ సినిమాకు ప్రశాంత్ సుందర్ దర్శకత్వం వహిస్తుండగా ప్రైమ్ సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను కె.యస్.రామకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ మొదలు పెట్టినట్టుగా తెలిపిన మేకర్స్ ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమా శ్రద్దా కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.