“స్పైడర్ మ్యాన్” హీరోయిన్ జెండయా మైనపు విగ్రహాన్ని ఇటీవల లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రవేశ పెట్టారు. మ్యూజియం అధికారిక ట్విట్టర్ ఖాతా ఈ అప్డేట్ ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. జెండయా పింక్ సూట్ ధరించి ఉన్న మైనపు విగ్రహం ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈ బ్యూటీ మైనపు విగ్రహంపై అభిమానులు ఏమాత్రం సంతృప్తి చెందలేదు. జెండయా అభిమానులు చాలా మంది ట్విట్టర్‌లో ఆమె మైనపు విగ్రహంపై నిరాశను వ్యక్తం చేశారు. కొంతమంది అయితే ఆ విగ్రహంలో జెండయా బదులుగా మరో హాలీవుడ్ బ్యూటీ కైలీ జెన్నర్ కన్పిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఇది వర్ణ వివక్ష అంతో మండిపడుతున్నారు. అంతేకాదు జెండయా కోపంగా ఎందుకు కన్పిస్తోందని ప్రశ్నిస్తున్నారు.
Read Also : RGV: బాహుబలి లెవెల్ సూపర్, మెగా బెగ్గింగ్.. జగన్‌నూ వదలని ఆర్జీవీ
జెండయా ఇటీవల టామ్ హాలండ్ నటించిన ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’లో కనిపించిన విషయం తెలిసిందే. అయితే జెండయా మైనపు విగ్రహాన్నిచూసి ఫ్యాన్స్ సంతోషిస్తారని భావించిన లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ నిర్వాహకులకు మాత్రం నెటిజన్ల నుంచి విమర్శలు రావడం షాకింగ్ అనే చెప్పాలి.
Z E N D A Y A ✨ pic.twitter.com/iJOO191CeP
— Madame Tussauds London (@MadameTussauds) February 8, 2022