మార్వెల్ స్టూడియోస్ తాజా చిత్రం “స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్” బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టిస్తోంది. ఇది ఈ సంవత్సరం భారతదేశంలో అతిపెద్ద ఓపెనర్‌గా రికార్డును సృష్టించింది. కలెక్షన్ల పరంగా భారీ తేడాతో సూర్యవంశీని సైతం అధిగమించి రికార్డును సృష్టించింది. “స్పైడర్‌మ్యాన్ : నో వే హోమ్” 1వ రోజు ఆల్ ఇండియాలో నెట్ రూ. 32.67 కోట్లు, గ్రాస్ రూ. 41.50 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ మార్వెల్ స్టూడియోస్ భారతదేశం విడుదల చేసిన హాలీవుడ్ సినిమాల పరంగా హైయెస్ట్ ఓపెనింగ్స్‌లో రెండవ స్థానాన్ని సొంతం చేసుకున్న అద్భుతమైన ఫీట్‌ని సాధించింది. ‘అవెంజర్స్ : ఎండ్ గేమ్’ ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉండగా, ‘స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’ రెండవ, ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ మూడవ స్థానాల్లో నిలిచాయి. మొదటి ‘స్పైడర్ మాన్’ చిత్రం లైఫ్ టైం గ్రాస్ రూ. 26 కోట్లు. భారతదేశంలో హాలీవుడ్ చిత్రాలను ఎలా ఆదరిస్తున్నారో ఈ సినిమాను చూస్తే అర్థం అవుతుంది. భారతదేశంలో అన్ని భాషల్లో కలిపి టాప్ ఓపెనింగ్స్ రాబట్టిన హాలీవుడ్ సినిమాలు ఇవే.
Read Also : విడుదలకు ముందే ‘ఆర్ఆర్ఆర్’ హవా… అడ్వాన్స్ బుకింగ్స్ జోరు
- ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ – రూ 53.60 కోట్లు
- స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ – రూ 32.67 కోట్లు
- ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ – రూ 31.30 కోట్లు
- ఫ్యూరియస్ 8 – రూ 14 కోట్లు (రూ. 8.5 కోట్ల ప్రివ్యూలు)
- హాబ్స్ మరియు షా – రూ 13.15 కోట్లు
- కెప్టెన్ మార్వెల్ – రూ 13 కోట్లు
- ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 – రూ 12.30 కోట్లు
- డెడ్‌పూల్ 2 – రూ 11.25 కోట్లు
- ఎవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ – రూ 10.98 కోట్లు
- లయన్ కింగ్ – రూ 10.09 కోట్లు
