Prabhas Craze in Bollywood: ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రభాస్ రాఘవుడిగా కృతి సనన్ జానకిగా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ లంకేషుడిగా నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో ఈ సినిమాను టీ సిరీస్ రెట్రో ఫైల్స్ సంస్థలు సుమారు 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక తెలుగు సహా హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాను తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు. నిజానికి ఈ సినిమా రిలీజ్ అయిన రోజు మిశ్రమ స్పందన వచ్చినా రోజుకు రోజుకు వసూళ్లు మెంటల్ ఎక్కిస్తున్నాయి. మొదటి రోజు 140 కోట్లు రాబట్టిన ఆదిపురుష్ సినిమా ఓవరాల్ గా మొదటి మూడు రోజులు కంప్లీట్ అయ్యే సరికి 340 కోట్లు కలెక్ట్ చేసిందని చెబుతూ నిర్మాతలు ఆదిపురుష్ కలెక్షన్స్ ని అఫీషియల్ గా రిలీజ్ చేశారు. నిజానికి ఈ వసూళ్లను కాస్త పెంచి చెబుతున్నారని ఆరోపణలున్నా అందుకు ప్రామాణికత లేదు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే మూడో రోజు కూడా వంద కోట్లు రాబట్టిన అతి తక్కువ సినిమాల్లో ఆదిపురుష్ కూడా స్థానం సంపాదించింది.
Anasuya Bharadwaj: నన్ను అందులోకి లాగకండి బాబోయ్!
అయితే ఇక్కడ బాలీవుడ్ క్రిటిక్స్ సహా ట్రేడ్ అనలిస్టులు షాక్ అవుతున్న విషయం ఏమిటంటే మొదటి వీకెండ్ లోనే ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ హిందీ మార్కెట్‌లో 100 కోట్ల మార్క్‌ను చేరుకుంది. నిజానికి తెలుగులో అయినా కొన్ని మంచి రివ్యూలు వచ్చాయి కానీ బాలీవుడ్ క్రిటిక్స్ అయితే సినిమాను తూర్పారబట్టారు. ఇలాంటి సినిమా చూడకూడదు అనే విధంగా రివ్యూలు ఇచ్చారు. అయితే ఇంత జరిగినా నార్త్ బెల్ట్ లో ప్రభాస్ ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు. పూర్తి స్థాయిలో నెగటివ్ రివ్యూలు కుమ్మరించడం వలన కలెక్షన్స్ మీద కొంత ప్రభావం ఉన్నప్పటికీ, ఆదిపురుష్ హిందీలో మొదటి వీకెండ్ లో అద్భుతంగా దూసుకుపోయింది. ఈ ఆదిపురుష్ సినిమా కేవలం మూడు రోజుల్లో దాదాపు 110 కోట్లు హిందీ బెల్ట్ లో వసూలు చేసింది.
Mega Family: మెగా ఫాన్స్ కి పండగ లాంటి న్యూస్…వారసుడి రాకకు ముహూర్తం ఫిక్స్?
హిందీలో ఆదిపురుష్ ఫాస్ట్ వీకెండ్ నెట్ కనుక పరిశీలిస్తే 1వ రోజు: ₹35 కోట్లు! 2వ రోజు: ₹35 కోట్లు! 3వ రోజు: ₹40 కోట్లు! మొత్తంగా మూడు రోజులకు ₹110 కోట్లు నెట్ వసూలు చేసింది. ఇక ఇక్కడ గమనించాల్సిన విశేషమేమిటంటే ప్రభాస్ ప్రమోషన్స్ కోసం నార్త్ సిటీలు తిరగడం కాదు కదా కనీసం ముంబైకి కూడా వెళ్లలేదు. చివరిగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ మాత్రమే ముంబైలో చేశారు. ఆ తర్వాత తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిపారు. ఇక అదే ప్రభాస్ ప్రమోట్ చేసిన చివరి ఈవెంట్. ఆ తరువాత హిందీ మీడియా, ప్రేక్షకుల కోసం ప్రెస్ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. తెలుగు ప్రేక్షకుల కోసం ప్రీ-రికార్డెడ్ ఇంటర్వ్యూను కూడా విడుదల చేయలేదు. సాధారణంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ప్రమోషన్స్ కీలకపాత్ర పోషిస్తాయి, స్టార్ హీరోలు కూడా అందుకు ఏమాత్రం మినహాయింపు కాదు. అయితే ఈ సినిమా విషయంలో రాముడి పాత్రధారణలో ఉన్న హీరో పోస్టర్ ఒక్కటే జనాలను ఆకట్టుకుని థియేటర్లను నింపేసింది. అలా మొత్తం మీద హీరోలందు ప్రభాస్ వేరయ్యా అన్నట్టుగా బాలీవుడ్ లో ఆయన డామినేషన్ సాగుతోంది.
Adipurush: ప్రమోషన్స్ చేయకుండానే బాలీవుడ్ దుమ్మురేపుతున్న ‘ఆది పురుష్’.. అరచాకం అంటే ఇదే!
Show comments