NTV Telugu Site icon

NTR 75: తారక రాముని సినీ ప్రయాణానికి 75 వసంతాలు

Ntr75

Ntr75

తెలుగు జాతి గర్వపడేలా, తెలుగు సినిమా కీర్తిని నలు దిశలా వ్యాపింపజేసిన ఎన్టీఆర్ నట ప్రస్థానానికి నేటితో 75 సంవత్సరాలు. అది 1946 ‘శోభనాచల’ సంస్థ నిర్మాత, దర్శకుడు మీర్జాపురం రాజా, స్వాతంత్య్ర సమర నేపథ్యం కథ కోసం  చూస్తున్నటైమ్ లో  బెంగాలీ రచయిత శరత్‌ బాబు రాసిన ‘విప్రదాస్‌’ నవల తెలుగు అనువాదంలో వారు  కోరుకున్న నేపథ్యం  దొరకడంతో ఆ నవలను ‘మన దేశం’ పేరుతో తెలుగు నేటివిటీకి  తగ్గట్టుగా మార్చమని  సముద్రాల రాఘవాచార్యకు ఇచ్చారు. ఇక అప్పటికే దర్శకుడిగా, నటుడిగా రంగ ప్రవేశం చేసిన ఎల్వీ ప్రసాద్‌ని ఈ సినిమాకు  దర్శకత్వ భాద్యతలు అప్పగించారు. ముఖ్యపాత్రల కోసం నాగయ్య, సి.హెచ్‌ నారాయణ రావు, కృష్ణవేణి, రేలంగి, వంగర లాంటి  సీనియర్ నటులను ఎంపిక చేసారు. కానీ ఇదే సినిమాలో కథలో కీలకమైన ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ పాత్ర ఉంది. నిడివి తక్కువే అయినా ఆ పాత్ర చాలా కీలకం.  దాని కోసం విజయవాడ నుంచి ఓ  కుర్రాడిని రప్పించారు. అతడే ఎన్టీఆర్.

తొలి కబురు :  ఎల్వీ ప్రసాద్ దగ్గర ఓసారి నిర్మాత బి.ఏ సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటో చూశారు. స్క్రీన్ టెస్ట్ కోసం రావాలని ఎన్టీఆర్ కు చెప్పారు. దాంతో అనుకున్నదే తడవుగా మద్రాసు రైలెక్కేసారు రామారావు. టెస్ట్ పూర్తయ్యాక మరో ఆలోచన లేకుండా తను తీస్తున్న పల్లెటూరిపిల్ల సినిమాలో ఎన్టీఆర్​కి అవకాశమిచ్చారు. కానీ అనుకోని కారణాల వలన ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దాంతో కృష్ణవేణి దంపతులు నిర్మిస్తున్న ‘మన దేశం’ సినిమా దర్శకత్వ భాద్యతలు ఎల్వీ ప్రసాద్ కు వచ్చాయి. అప్పటికే నటీనటులందరి ఎంపిక చేసి ఉంచారు కృష్ణవేణి. ఒక్క కానిస్టేబుల్ పాత్ర మాత్రమే కొరవ ఉంది. ఆ పాత్రకు ఎన్టీఆర్ సరితూగుతాడని బావించి ఎన్టీఆర్ ను పిలిపించి అవకాశం ఇచ్చారు ఎల్వీ ప్రసాద్.

 యాక్షన్.. రియాక్షన్ :  ‘మనదేశం’ చిత్రంలో హీరో ను ఎన్టీఆర్‌ అరెస్టు చేసే సన్నివేశంలో ఎదురుతిరిగిన ఉద్యమకారుల మీద పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేసే చేయాలని సీన్ వివరించారు ఎల్వీ ప్రసాద్‌. ఆయన యాక్షన్ అని చెప్పడం ఆలస్యం ఎన్టీఆర్ ఉద్యమకారులుగా నటిస్తున్న వారిపై విజృభించారు. లాఠీతో దొరికిన వారిని దొరికినట్టుగా బాదేశారు. ఎన్టీఆర్ రియాక్షన్ కు ఒక్కసారిగా షాక్ తిన్న ఎల్వీ ప్రసాద్ కట్ చెప్పి చూడు నాయన ఇది నాటక కాదు సినిమా ఇక్కడ అలా క్రొత్త కూడదు కొట్టినట్టు హావభావాలు మాత్రమే చూపించు అని చెప్పడంతో చిటికెలో అందుకున్న ఎన్టీఆర్ ఇన్‌స్పెక్టర్‌ పాత్రలో జీవించేశాడు. ఆ రోజు ఎన్టీఆర్ చూపించిన డెడికేషన్ కు ఎప్పటికైనా ఇతను గొప్ప నటుడు అవుతాడని భావించారు దర్శక నిర్మాతలు.

రిలీజ్ అడ్డంకులు : ముందుగా మనదేశం సినిమాను 1947 ఆగస్టు 15 డేట్ నాటికి రిలీజ్ అనుకున్నారు. కానీ అనుకున్న దాని కంటే బడ్జెట్ పెరగడంతో షూటింగ్ రెండు నెలలు ఆలస్యం అయింది. అలా మొత్తానికి 1949 నవంబరు 24నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలా ఎన్టీఆర్ నటించిన మొదటి సినిమా తెలుగు తెరపై సరిగ్గా 75 సంవత్సరాల క్రితం రిలీజ్ అయింది. ఓ మాదిరిగా ఉందని టాక్ తెచ్చుకున్న మనదేశం రిపీట్‌ రన్స్‌లో నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.

మనదేశం – తెలుగుదేశం : అక్కడ నుంచి  సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాలలో నటించి మెప్పించిన ఎన్టీఆర్ ప్రేక్షక హృదయాల్లో రాముడిగా, కృషుడిగా ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అటు పిమ్మట రాజకీయాలలో ప్రవేశించి ‘ సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు’ అనే నినాదం తో తెలుగుదేశం పార్టీని స్థాపించి,  పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రిగా నేటికి  తెలుగు ప్రజలతో జేజేలు పలికించుకుంటున్న ఎన్టీఆర్ కు చిత్ర సీమలో బాటలు వేసిన సినిమా మనదేశం.

Show comments