Site icon NTV Telugu

Naga Chaitanya: మెగా, అల్లు దెబ్బకు అక్కినేని ‘తండేల్’ కు తలనొప్పి..

Untitled Design 2024 08 18t133511.285

Untitled Design 2024 08 18t133511.285

నాగ చైత‌న్య లేటెస్ట్ చిత్రం తండేల్‌. కార్తికేయ-2 వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రానుంది తండేల్. ఏపీకి చెందిన కొంత మంది జాలర్లు స‌ముద్రంలో చేప‌ల వేట‌కు వెళ్లి, అనుకోకుండా పాకిస్థాన్ బోర్డ‌ర్‌లోకి ప్ర‌వేశిస్తారు. వారిని అక్కడ పాకిస్థాన్ నేవీదళం అరెస్ట్ చేయడం, అక్కడ ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నారు, ఎలా బ‌య‌ట‌ప‌డ్డార‌నే క‌థాంశంతో తండేల్ మూవీ తెర‌కెక్కుతోంది. ల‌వ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి చేస్తున్నరెండవ సినిమా ఇది.

Also Read: Game Changer: ఓవర్సీస్ లో గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ సాధించేనా..?

తండేల్‌ను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అర‌వింద్ పాన్ ఇండియా భాషలలో దాదాపు రూ. 75 కోట్లతో రూపొందిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా డిసెంబ‌ర్‌ 6న రిలీజ్ కావాలి. కానీ అదే రోజు తండేల్ నిర్మాత అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 రిలీజ్ కానుంది. దీంతో సినిమా రిలీజ్ డేట్ మారింది. ఈ వార్త‌ల‌పై రీసెంట్ ఆయ్ సక్సెస్ ఇంట‌ర్వ్యూలో గీతా ఆర్ట్స్ నిర్మాత బ‌న్నీ వాస్ స్పందించారు. ” తండేల్ సినిమా షూటింగ్ ప్లానింగ్ ప్రకారం జ‌రుగుతుంది. ముందు డిసెంబ‌ర్‌లో రిలీజ్ అనుకున్నాం. అయితే అదే నెల‌లో పుష్ప 2, గేమ్ చేంజ‌ర్ రిలీజ్‌ కాబోతున్నాయి. తండేల్ సినిమాకు సముద్రంలో భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌కు సంబంధించిన సీజీ వ‌ర్క్ చాలా కీలకం. సీజీ వ‌ర్క్‌పై వ‌ర్క్ చేస్తోన్న కంపెనీలు ఏమంటాయో అనే దాన్ని బ‌ట్టే తండేల్ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేయాల‌నుకుంటున్నాం. ద‌స‌రా త‌ర్వాతే తండేల్ రిలీజ్ డేట్ మీద క్లారిటీ వ‌స్తుంద‌నుకుంటున్నాను” అని అన్నారు.

Exit mobile version