Site icon NTV Telugu

Samantha: మహా శివరాత్రి కానుకగా ‘శాకుంతలం’ కొత్త పోస్టర్…

Samantha

Samantha

లేడీ సూపర్ స్టార్ సమంతా నటించిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాని గుణశేఖర్ డైరెక్ట్ చేశాడు. శకుంతల దేవి, దుష్యంత మహారాజుల కథగా రాయబడిన ఈ కథలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. వాటిని బాలన్స్ చేస్తూ గుణశేఖర్ 3Dలో శాకున్తలంస్ సినిమాని తెరకెక్కించాడు. ఈ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ ని చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫిబ్రవరి 17న సమంతా శాకుంతలం సినిమాతో పాన్ ఇండియా హిట్ కొడుతుంది అని అందరూ భావించారు. పోస్ట్ ప్రొడక్షన్ డిలే అవుతున్న కారణంగా శాకుంతలం సినిమాని ఏప్రిల్ 14కి వాయిదా వేశారు.  ఇటివలే కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తాజాగా మహా శివరాత్రి పండగ సంధర్భంగా శాకుంతలం సినిమా నుంచి పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సమంతా, శివపూజా చేస్తూ కనిపించింది.

Read Also: Shakuntalam: ఈ పోస్టర్ చాలా హాట్ గురూ…

Read Also: Shakuntalam: ఈ సాంగ్ లో అన్నీ అద్భుతాలే…

Exit mobile version