NTV Telugu Site icon

Charan NTR: వార్ 2 vs ధూమ్ 4… బాలీవుడ్ కూడా మన హీరోల మధ్యే వార్

Charan Ntr

Charan Ntr

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే నార్త్ ఇండియాలో జెండా పాతి ఖాన్స్ కి కూడా అందని రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్నాడు. షారుఖ్ లాంటి సూపర్ స్టార్ హీరోతో క్లాష్ ఉన్నా కూడా ప్రభాస్ నార్త్ బెల్ట్ లో వంద కోట్లని రాబడుతున్నాడు అంటే ప్రభాస్ మార్కెట్ హిందీలో ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ కూడా నార్త్ లో సోలో సాలిడ్ మార్కెట్ కోసం రెడీ అవుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో హిందీ బెల్ట్ లో స్టార్స్ గా ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్. జక్కన్న ఇచ్చిన ఎంట్రీ పాస్ తో బాలీవుడ్ లో సత్తా చాటాలి, మార్కెట్ సొంతం చేసుకోవాలి అంటే మాత్రం ఎన్టీఆర్ అండ్ చరణ్ సొంతగా కష్టపడాలి, నార్త్ ఆడియన్స్ కి నచ్చే సినిమాలు చేయాలి. ఇప్పుడు ఈ పని చేయడానికే ఎన్టీఆర్-ఎన్టీఆర్ రెడీ అవుతున్నారని సమాచారం. ఎన్టీఆర్ ఇప్పటికే హ్రితిక్ రోషన్ తో వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. అనౌన్స్మెంట్ తోనే బజ్ జనరేట్ చేసిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపొయింది. దేవర షూటింగ్ కంప్లీట్ అయిపోతే ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అయిపోతాడు. ఇప్పుడు చరణ్ కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇండియన్ సినిమాలో ఫ్రాంచైజ్‌ లు పెద్దగా ప్రేక్షకులని అలరించవు అనే మాటని పూర్తిగా చెరిపేస్తూ ఇండియన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ రేంజులో పేరు తెచ్చుకుంది ‘ధూమ్ సిరీస్‌’. ఇప్పటికే మూడు పార్ట్స్ వచ్చిన ఈ ఫ్రాంచైజ్ నుంచి లేటెస్ట్ గా ధూమ్ 4 సినిమాని అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. చాలా రోజులుగా ఈ విషయంపై బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి కానీ ధూమ్ 4 అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. లేటెస్ట్ గా అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం… ధూమ్ 4 సినిమాలో షారుఖ్ ఖాన్‌తో పాటు రామ్ చరణ్ కూడా నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే చరణ్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు, ఇది అవ్వగానే బుచ్చిబాబుతో RC16 స్టార్ట్ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు అయ్యే వరకూ చరణ్ ఇంకో సినిమా సైన్ చేస్తాడా లేదా అనేది ఆలోచించాల్సిన విషయమే. ఒకవేళ నిజంగానే చరణ్ ధూమ్ 4లో అడుగు పెడితే మాత్రం రచ్చ మాములుగా ఉండదు. ఇప్పటికే దేవర, గేమ్ ఛేంజర్ సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ 2024లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. ఇవి కూడా నార్త్ లో సూపర్ హిట్స్ గా నిలిస్తే… అటు వార్ 2 తో ఎన్టీఆర్, ఇటు ధూమ్ 4తో రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్ లోనే బాలీవుడ్ హీరోలతోనే పోటీ పడడం గ్యారెంటీ. మరి ఈ ఇద్దరి దండయాత్రని బాలీవుడ్ ఎలా తట్టుకుంటుందో చూడాలి.