NTV Telugu Site icon

Salaar: మూడు తెగల పేర్లు చెప్పండి… స్పెషల్ గిఫ్ట్ పట్టేయండి

Hombale Salaar

Hombale Salaar

ప్రశాంత్ నీల్ తన మొదటి సినిమా ఉగ్రమ్ కథకి మార్పులు చేర్పులు చేసి… ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్లు పాన్ ఇండియా సినిమాగా సలార్ ని చేసాడు. సలార్ సీజ్ ఫైర్ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఉగ్రమ్ సినిమాలాగే ఉంటుంది. సీన్ బై సీన్ ఉగ్రమ్ సినిమానే పెట్టేసిన ప్రశాంత్ నీల్… ఇంటర్వెల్ బ్యాంగ్ కి గూస్ బంప్స్ తెచ్చాడు. ఉగ్రమ్ చూడని వాళ్లకి సలార్ ఫస్ట్ హాఫ్ పూనకాలు తీసుకోని వస్తుంది. ఉగ్రమ్ చూసిన వాళ్లకి కూడా నచ్చేలా చేయడంలోనే ప్రశాంత్ నీల్ స్పెషాలిటీ ఉంది. సెకండ్ హాఫ్ లో కంప్లీట్ గా కొత్త కథని చెప్పిన ప్రశాంత్ నీల్ ఖాన్సార్ ప్రాంతం ఎలా ఏర్పడింది? అక్కడ ఎవరు ఉండేవారు? ఎవరు రూల్ చేస్తున్నారు? లాంటి డ్రామాని ఫిట్ చేసాడు. సెకండ్ హాఫ్ తో ఇండియన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సినిమాని చూపించాడు ప్రశాంత్ నీల్. దీంతో బాక్సాఫీస్ దగ్గర భూకంపం వచ్చినంత పనవుతోంది. డే 1 వరల్డ్ వైడ్ 180 కోట్లు కలెక్ట్ చేసిన సలార్, డే 2 డే 3లు సాలిడ్ నంబర్స్ ని పోస్ట్ చేయడం గ్యారెంటీగా కనిపిస్తోంది.

(స్పాయిలర్స్ ఎహెడ్)… సలార్ మూవీ ప్రొడ్యూసర్స్ హోంబలే ఫిల్మ్స్… సెకండ్ రోజే ప్రభాస్ అభిమానులకి ఒక కాంటెస్ట్ పెట్టింది. సలార్ సినిమాలో ఉన్న తెగల పేర్లు చెప్పండి, హోంబలే వర్స్ మార్కండైజ్ నుంచి స్పెషల్ గిఫ్ట్ ని సొంతం చేసుకోండి అంటూ హోంబలే అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి పోస్ట్ వచ్చింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్… మన్నార్, శౌర్యాంగ, ఘన్సార్ అంటూ తెగల పేర్లు చెప్పేస్తున్నారు. ఇందులో పృథ్వీరాజ్, జగపతి బాబు, శ్రీయా రెడ్డి, గరుడ రామ్ లు మన్నార్ తెగకి చెందిన వాళ్లు. బ్రహ్మాజీ, జాన్ విజయ్ లు ఘన్సార్ తెగకి చెందిన వాళ్లు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ శౌర్యాంగ తెగకి చెందిన వాడు. శ్రీయా రెడ్డిని పెళ్లి చేసుకోని జగపతి బాబుకి అల్లుడి క్యారెక్టర్ ప్లే చేసిన బాబీ సింహా కూడా శౌర్యాంగ తెగకి చెందిన వాడే. ప్రభాస్ అండ్ బాబీ సింహా ఐడెంటిటీని పార్ట్ 2కి లీడ్ ఇస్తూ రివీల్ చేసాడు ప్రశాంత్ నీల్.