NTV Telugu Site icon

Sound Party Trailer: బిగ్ బాస్ సన్నీ కొత్త సినిమా.. సౌండ్ అదిరేలానే ఉందే

Sound

Sound

Sound Party Trailer: VJ సన్నీ.. యాంకర్ గా కెరీర్ ప్రారంభించి.. సీరియల్ నటుడిగా మారి.. బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా వెళ్లి .. విన్నర్ గా నిలిచాడు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాకా.. హీరోగా సినిమాలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. హిట్, ప్లాప్స్ అనేవి పక్కన పెట్టి వరుస సినిమాలను లైన్లోపెడుతున్నాడు. ఇక తాజాగా సన్నీ నటించిన చిత్రం సౌండ్ పార్టీ. VJ సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టించారు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్రలు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంజ‌య్ శేరి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం టీజ‌ర్, పాట‌లు ఇప్ప‌టికే విడుద‌లై టాలీవుడ్ లో గ‌ట్టిగానే సౌండ్ చేశాయి. ఫుల్ లెంగ్త్ కామెడీగా ఉందనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నవంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర బృందం.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది.

Allu Sirish: మంచక్క కు ముద్దు.. తారక్ అన్నకు హగ్గు.. అదిరిందయ్యా శిరీష్

ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమాలో సన్నీ, శివన్నారాయణ తండ్రీకొడుకులుగా కనిపించారు. డబ్బు లేని మధ్యతరగతి కుటుంబంలో బతుకుతున్న వీరికి.. అనుకోకుండా బోల్డంత డబ్బు దొరుకుతుంది. దానివలన ఎదురయ్యే పరిస్థితిలు ఏంటి.. ? అసలు ఆ డబ్బు ఎక్కడిది.. ? తండ్రీకొడుకులిద్దరూ జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైలర్ లో కామెడీ పంచ్ లు బాగా పేలేలా కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో సన్నీ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Sound Party Trailer | VJ Sunny, Hrithika Srinivas | Sanjay Sheri | Mohith Rehamanic