Varasudu: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, రష్మిక జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వరిసు. తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ కానుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మూడో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సోల్ ఆఫ్ వారసుడు అంటూ రిలీజ్ అయిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఎన్నో ఏళ్ళ తరువాత కొడుకును చూసిన తల్లి పడే బాధ, ఆనందం ఈ సాంగ్ లో చూపించారు.
రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్, చిత్ర మెస్మరైజ్ వాయిస్ ప్రతి ఒక్కరి హృదయాలను తాకింది. చాలా రోజుల తరువాత మంచి అమ్మ సాంగ్ విన్నట్లు అనిపిస్తోంది. ఇది నీకోసమే అమ్మ అంటూ పోస్టర్ పై రాసి ప్రతి అమ్మకు ఈ సినిమాను అంకితం చేశారు. ఇక వీడియోలో విజయ్ తల్లిగా జయసుధ నటిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ ఒక చేతిలో బ్యాగ్.. మరో చేతిలో సన్ గ్లాసెస్తో సూపర్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సంక్రాంతి బరిలో వారసుడు ఎలా సందడి చేస్తాడో చూడాలి.
