Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’

Soori

Soori

నటుడు సూరి హాస్య నటుడిగా వందలాది చిత్రాల్లో అలరించి ‘పరోటా సూరి’గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన ‘విడుదలై Part 1’ చిత్రంతో కథానాయకుడిగా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించి తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత విడుదలై పార్ట్ 2తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక గరుడన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే మార్కెట్ ను కూడా మరింత పెంచుకున్నాడు. ఇక కొట్టుక్కాలి వంటి సినిమాతో నటుడిగా తనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించారు. గతేడాది వచ్చిన మామన్ సూపర్ హిట్ అయింది.  ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సూరి కథ అందించడం విశేషం. ఇక ఇప్పడు ఇటీవలే విడుదలైన ‘మందాడి’ చిత్రంతో యాక్షన్ హీరోగా కూడా తన సత్తా చాటారు. ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో  రూ. 100 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్హొంది.

సూరి కథానాయకుడిగా వరుస హిట్లు అందుకోవడంతో పాటు మార్కెట్ వాల్యూ విపరీతంగా పెంచుకుంటూ వెళ్తున్నాడు. నెక్ట్స్ ప్రాజెక్టులకు ఏకంగా రూ. 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు మాస్ ఎలిమెంట్స్ ఉన్న ప్రాజెక్టులను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. కమెడియన్ నుండి యాక్టర్ గా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించగల సామర్థ్యం ఉన్న హీరోగా ఎదిగి, బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసిన సూరి ప్రయాణం ఎందరో నటులకు నిదర్శనంగా నిలుస్తోంది.