Sooreede song From Salaar Movie Released: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అభిమానులు అందరూ ఎంతో ఎక్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్న సలార్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. కేజీఎఫ్ సిరీస్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తోన్న ఈ సలార్ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. Salaar పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ మొదలు పెట్టింది సలార్ సినిమా టీం. ముందుగా ప్రకటించిన ప్రకారం సలార్ ఫస్ట్ సింగిల్ సూరీడే సాంగ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. సూరీడే గొడుగు పట్టి, వచ్చాడే భుజము తట్టి అంటూ సాగుతున్న ఈ సాంగ్ ఆద్యంతం ఆసక్తికరంగా ఆగింది.
Oh My Baby: గుంటూరు కారం ‘ఓమై బేబీ’ వచ్చేసింది
స్నేహితుల మధ్య బాండింగ్ తెలియచేసేలా ఈ సాంగ్ రాశారు. కృష్ణకాంత్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను హరిణి ఆలపించారు. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్విరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ పోషిస్తున్న వరదరాజ మన్నార్ లుక్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే సలార్‌ను కేరళలో పృథ్విరాజ్ సుకుమారన్ హోం బ్యానర్ పృథ్విరాజ్ ప్రొడక్షన్స్ హౌజ్ విడుదల చేస్తోండగా నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్, నార్తిండియాలో అనిల్ తడని AA Films ఈ సినిమాను విడుదల చేస్తోంది.