Sonusood : యాక్టర్ సోనూసూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో సేవా కార్యక్రమాలతో కరోనా నుంచి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. హీరోలకు మించి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. విద్యార్థులు, నిరుపేదలకు ఏ అవసరం వచ్చినా సోనూసూద్ సాయం చేస్తున్నారు. తన ఇంటికి వచ్చిన వందలాది మందికి ఏదో ఒక విధంగా సాయం అందిస్తున్నాడు. అటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఇటు సినిమాల్లో బిజీగా ఉంటున్నాడు. జులై 30న ఆయన 52వ బర్త్ డే ఉంది. ఈ సందర్భంగా మరో కీలక ప్రకటన చేశాడు. తన బర్త్ డే సందర్భంగా 500 మంది వృద్ధుల కోసం ఆశ్రమం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాడు.
Read Also : Kingdom : కింగ్ డమ్ పార్ట్-2.. అవసరమా..?
త్వరలోనే కంప్లీట్ డీటేయిల్స్ వెల్లడిస్తానని అన్నారు సోనూసూద్. వృద్ధాశ్రమాలతో పాటు ఉచిత స్కూళ్లు ఏర్పాటు చేయాలన్నది తన కల అని వెల్లడించారు. ఆయన నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. సోనూ ఇప్పటికే చాలా విషయాల్లో సాయం చేస్తున్నారు. కరోనా టైమ్ లో ఎంతో మందిని వాళ్ల సొంత ఊర్లకు తన ఖర్చులతో పంపించారు. అప్పటి నుంచి నిరుద్యోగులకు, హెల్త్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇలా చాలా రకాలుగా సాయం అందిస్తున్నారు. ఆయన ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఇలా రకరకాలుగా సాయం అందిస్తున్నారు సోనూసూద్.
Read Also : Kingdom : నెపోటిజం తప్పు కాదు.. విజయ్ కామెంట్స్
