Site icon NTV Telugu

కె.బి.సి. షోకు కపిల్ శర్మతో కలిసి సోనూసూద్!

సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి -13’వ సీజన్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే శుక్రవారం ఈ షోలో పాల్గొంటున్న కంటెస్ట్స్ కారణంగా ఈ ఎపిసోడ్ కు సూపర్ రెస్పాన్స్ రాబోతోంది. కరోనా సమయంలో లక్షలాది మంది వలస కార్మికులను స్వగ్రామాలకు చేర్చిన ఘనత సోనూసూద్ కు దక్కుతుంది. ప్రైవేట్ వెహికిల్స్, రైళ్ళు, చివరకు విమానాల్లోనూ కార్మికులను సోనూసూద్ స్వస్థలాలకు చేర్చాడు. ఆ తర్వాత కూడా విద్య, వైద్యం విషయంలో ఆదుకుంటూనే ఉన్నాడు. అలానే రైతులకు తన చేతనైనంత సాయం చేస్తున్నాడు. మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచిన సోనూసూద్ ఈ శుక్రవారం ప్రసారమయ్యే కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో పాల్గొన్నాడు. విశేషం ఏమంటే అతనితోపాటు ప్రముఖ కమెడియన్, టీవీ ప్రజంటేటర్ కపిల్ శర్మ కూడా హాజరయ్యాడు. దీనికి సంబంధించిన ప్రోమోను సోనీ సంస్థ మంగళవారం విడుదల చేసింది. కెబీసీ షోకు కపిల్ శర్మ నాలుగు గంటల ఆలస్యంగా హాజరయ్యారంటూ అమితాబ్ సెటైర్ వేయగా, అమితాబ్ ఇంటికి ఎవరు అతిథులుగా వెళ్ళినా, వారికి ఆతిథ్యాన్ని అమితాబ్ కేబీసీ స్టయిల్ లో ఇస్తారంటూ కపిల్ శర్మ కామెడీగా చేసి చూపించాడు. మొత్తానికి శుక్రవారం ప్రసారం కాబోయే కేబీసీ ఎపిసోడ్ సమ్ థింగ్ స్పెషల్ గా ఉండబోతోంది.

Exit mobile version