Site icon NTV Telugu

Sonam Kapoor : బేబీ బంప్ తో స్టార్ హీరోయిన్ ఫోటోషూట్… పిక్స్ వైరల్

Sonam Kapoor

Sonam Kapoor

బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ గత నెలలో భర్త ఆనంద్ అహుజాతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ తాను ప్రెగ్నెన్సీ అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించి అభిమానులందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో తల్లి కాబోతున్న సోనమ్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఇక తాజాగా సోనమ్ బేబీ బంప్ తో చేసిన ఫోటోషూట్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలలో ఆమె తెల్లని దుస్తులు ధరించి అద్భుతంగా కన్పిస్తోంది. రెట్రో లుక్ లో సోనమ్ మెరిసిపోతున్న ఈ ఫోటోలను చూసి నెటిజన్లు బ్యూటిఫుల్ మమ్మీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ పిక్స్ లో సోనమ్ రాయల్ గా కన్పిస్తోంది. సోనమ్ 2022 ఆగస్ట్  3వ వారంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి చాలా రోజులుగా సోనమ్ బయట ఎక్కడా కన్పించలేదు. సినిమాలు కూడా చేయలేదు. సోనమ్ ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అవ్వడం వల్లే సినిమాలకు దూరంగా ఉంది. అయితే విషయాన్ని సోనమ్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు ఎవ్వరూ బయట పెట్టలేదు. కానీ ఇటీవలే సోనమ్ స్వయంగా ప్రకటించింది.

Read Also : Ram Charan : థియేటర్లోకి చెర్రీ సడన్ ఎంట్రీ… ఆడియన్స్ కు సర్ప్రైజ్

Exit mobile version