NTV Telugu Site icon

Sonali Kulkarni: అమ్మాయిలకు అది ఎక్కువైంది.. అవసరాలు తీర్చే బాయ్ ఫ్రెండ్ కావాలి

Sonali

Sonali

Sonali Kulkarni: కొన్ని నిజాలు చెప్పడానికి కఠినంగా ఉన్నా.. అవి నిజాలు అంటారు కొంతమంది. వాటిని సామాన్యులు చెప్తే పెద్ద పట్టించుకోరు కానీ.. ఏ ఒక సెలబ్రిటీ చెప్తే మాత్రం ప్రతిఒక్కరు వింటారు. వినడం పక్కన పెడితే.. కొంతమంది సపోర్ట్ చేస్తారు.. ఇంకొంతమంది విమర్శిస్తారు. అయితే ఆ ప్రశంసలు, విమర్శలు సమానంగా తీసుకున్నవారే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వగలరు. తాజాగా బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి చేసిన స్టేట్మెంట్స్ సైతం అలానే ఉన్నాయి. ఒక మహిళ అయ్యి ఉండి మిగతా మహిళలను కించపరుస్తోంది అని కొంతమంది కామెంట్స్ చేసినా ఆమె అన్నదాంట్లో తప్పేం ఉంది అని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఇంతకు ఆమె ఏమన్నదీ..? ఎవరు ఈ హీరోయిన్ అనేది తెలుసుకుందాం.

Virat Kohli: నాటు నాటు స్టెప్ వేసిన విరాట్.. నువ్వు కూడా హీరో అయిపో అన్నా

మరాఠీ, గుజరాతీ, కన్నడ, హిందీ సినిమాల్లో మంచి నటిగా పేరుతెచ్చుకుంది సోనాలి. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేయకపోయినా తాజాగా మాత్రం మహిళల గురించి కొన్ని నిజాలు చెప్పుకొచ్చింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేశంలోని ఆడవారికి సోమరితనం ఎక్కువైంది. ” సమాజంలో మగవారు 16 ఏళ్లకే కష్టపడుతున్నారు. కానీ, ఆడవారు మాత్రం 25 ఏళ్లు వచ్చినా తమకు అన్ని అవసరాలు తీర్చే బాయ్ ఫ్రెండ్ కానీ, భర్త కానీ కావాలని కోరుకుంటున్నారు. మాకు అవి కావాలి.. ఇవి కావాలి అంటూ వారిని బలవంతపెడుతున్నారు. పెళ్లి చేసుకోవాలనుకుంటే.. అబ్బాయికి పెద్ద ఇల్లు ఉండాలి.. రూ. 50 వేలకు మించి శాలరీ ఉండాలి. కారు ఉండాలి.. అని చెప్పుకొస్తున్నారు. వారి కావాల్సింది అబ్బాయిలా..? ఆఫర్లా..?.. అమ్మాయి అయిన అబ్బాయి అయిన కష్ట, సుఖాలను ఇద్దరు సమానంగా పంచుకోవాలి. కానీ అమ్మాయిలు అది వదిలేసి పనికిమాలిన సమస్యలపై మానవ హక్కుల సిబ్బంది వద్దకు వెళ్తున్నారు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈవ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ముఖ్యంగా అబ్బాయిలు అయితే ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇది నిజం.. పచ్చి నిజం అంటూ చెప్పుకొస్తున్నారు.

Show comments