Site icon NTV Telugu

Sonali Bendre: డబ్బుకోసం మాత్రమే ఆ పాత్రలు చేశాను..

sonali bendre

sonali bendre

సాధరణంగా ఏ హీరోయిన్ కి అయినా అవకాశాలు అన్నివేళలా రావు.. వచ్చిన ప్రతి అవకాహన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లడమే సక్సెస్ ఫుల్ హీరోయిన్ లక్షణం.. అయితే కొన్నిసార్లు తమకు ఇష్టం లేని పాత్రలు కూడా చేయాల్సి వస్తుంది. వాటికి కారణాలు రెండు.. ఒకటి డబ్బు.. రెండోది పేరు .. ఎక్కువగా అయితే సగానికి సగం మంది డబ్బు కోసమే కొన్ని ఇష్టంలేని పాత్రలు చేస్తూ ఉంటారు. అందులో నేను కూడా అతీతం కాదు అంటుంది సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే. మురారి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ టీవీ షోల కు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూ లో ఆమె కెరీర్ లో ఎదుర్కున్న కష్టాలను చెప్పుకొచ్చింది.

“ఒకానొక సమయంలో నా చేతిలో అవకాశాలు లేవు.. డబ్బు ఎంతో కావాల్సి వచ్చింది. ఇంటి రెంట్ కట్టాలి.. బిల్లులు పే చేయాలి. ఇలా అన్ని డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. ఆ సమయంలో పాత్ర ఏంటి.. అది నాకు నచ్చిందా..? లేదా అని ఆలోచించలేదు.. డబ్బు కోసం ఏ పాత్ర చేయడానికైనా రెడీ అనేశాను. కనై ఒప్పుకున్నాకా అసలు ఎందుకు ఇలాంటి పాత్రలను ఒప్పుకున్నాను అనిపించేది.. కానీ వెంటనే డబ్బులు ఎప్పుడు ఇస్తారో అని ఆలోచించేదాన్ని. ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు ఆ సినిమాలను నేను కూడా చూడలేదు.. ఇక మీరు చూసే అవకాశమే లేదు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోనాలి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version