దాదాపు పదిహేనేళ్ళ క్రితం వి. ఎన్. ఆదిత్య డైరెక్ట్ చేసిన ‘రెయిన్ బో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సోనాల్ చౌహాన్. తొలి హిందీ చిత్రం ‘జన్నత్’ మంచి గుర్తింపు తెచ్చిపెట్టినా, తెలుగులో మాత్రం మొదటి సినిమా నిరాశకు గురి చేసింది. అయితే అందం, అభినయంతో పాటు చక్కని ప్రతిభ కూడా ఉండటంతో జయాపజయాలతో నిమిత్తం లేకుండా పలు భాషల్లో అవకాశాలు అందిపుచ్చుకుంది సోనాల్. విశేషం ఏమంటే… తెలుగులో బాలకృష్ణ సరసన ‘లెజెండ్, డిక్టేటర్, రూలర్’ చిత్రాలలో నటించిందామె.
అలానే ‘పండగ చేస్కో, షేర్, సైజ్ జీరో’ వంటి చిత్రాల్లోనూ మెరిసింది. ఇక ఇప్పుడు అమ్మడు ప్రామిసింగ్ క్యారెక్టర్స్ ను తన ఖాతాలో వేసుకునే పనిలో పడిందిఇ. ఈ నెల 27న రాబోతున్న ‘ఎఫ్ 3’ మూవీలో సమ్ థింగ్ స్పెషల్ క్యారెక్టర్ ను సోనాల్ చౌహాన్ చేస్తోంది. అలానే నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ది ఘోస్ట్’లో సూపర్ యాక్షన్ రోల్ చేస్తోంది. మే 16 ఆమె పుట్టిన రోజు సందర్భంగా ‘ఎఫ్ 3’ అండ్ ‘ది ఘోస్ట్’ చిత్ర బృందాలు సోనాల్ చౌహాన్ కు స్పెషల్ పోస్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపాయి.
Sonal Chauhan Birthday
